రంగారెడ్డి

కాయ్ రాజా కాయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 9: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. అభ్యర్థుల గెలుపుపై కార్యకర్తలు విస్తృతంగా మంతనాలు చేస్తున్నారు. ఏ నోట విన్నా ఎన్నికల ఫలితాల విషయాలపై ఎక్కువగా చర్చలు వినిపిస్తున్నాయి. ఏ గ్రామంలో ఎంతశాతం పోలింగ్ జరిగింది..ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయనే అంచనాలపై కార్యకర్తలు, నాయకులు జోరుగా చర్చలు కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎవరికి వారే బెట్టింగ్‌లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మా పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడని..లేదు..లేదు మా పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారంటూ ఇలా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతో రూ.5వేల నుండి ఒక లక్ష రూపాయల వరకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నువ్వా..నేనా అన్నట్లు పోరు సాగడంతో అదృష్టం ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారనే దానిపై ఎవరికి వారే బెట్టింగ్‌లు వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితమైన బెట్టింగ్‌లు కాస్తా రాజకీయ పార్టీలకు తాకిందని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారం హోరెత్తడం..ప్రతి పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విజేతగా ఎవరు నిలుస్తారనేది విశే్లషించడం కష్టంగా మారింది. షాద్‌నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్, మహాకూటమి కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో తలపడటంతో గెలుపోటములపై అంచనాలు వేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఎగ్జిట్ పోల్స్‌లో ఓటరు నాడి బయటపడుతుందని అంచనాలు వేసినప్పటికి అధికార పార్టీకే ఎక్కువ మొగ్గు చూపించడంతో ఆశించిన స్థాయిలో విజయాలు లభిస్తాయా..లేదా అనే సందేహాలు నేతల్లో నెలకొన్నాయి. ఎన్నికల్లో విజయం సాధించకుంటే విహారయాత్రలకు తీసుకువెళ్తామని, మరికొందరు విందు, వినోదం ఏర్పాటు చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పందెం సొమ్ముకు రెట్టింపు ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు డిసెంబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రతి ఒక్కరి చూపు స్ట్రాంగ్ రూమ్‌ల వైపే ఉంది.