రంగారెడ్డి

అందుబాటులో ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 10: ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని కీటకశాస్త్ర పరిశోధనల్లోనూ విరివిగా వినియోగించాలని సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, ఎంటమాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎస్ పురి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ది ఎంటమాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా, అగ్రి బయోటెక్ ఫౌండేషన్ సంయుక్తంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఎంటమాలజీ 2018 అడ్వానె్సస్ అండ్ ఛాలెంజెస్ జాతీయ సింపోజియం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాగు ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్లాంట్ ప్రొటెక్షన్ శాస్తవ్రేత్తలు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాలలో ఉన్న పంటలను చీడ, పీడల నుంచి కాపాడేందుకు ఎంతగా కృషి చేస్తారో.. పంటకోత అనంతరం కూడా స్టోరేజీ నష్టాలను తగ్గించేందుకు అంతే స్థాయిలో శాస్త్ర పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచాలని సూచించారు. వివిధ ఆహార పంటల ఉత్పత్తులలో ఉన్న మందుల అవశేషాలను గుర్తించే పరిశోధనా పద్ధతులను మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వేగంగా పురుగుల మందుల అవశేషాలను గుర్తించే విశే్లషణ పద్ధతులను అభివృద్ధి పరచాలని సూచించారు. ఫలితంగా రైతులు పండించిన పంటల ఎగుమతుల్లో ఇబ్బందులు తప్పుతాయని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి అగ్రి బయోటెక్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పంటలపై రసాయనిక పురుగు మందుల వాడకం వల్ల పెరిగే పెట్టుబడి ఖర్చులను తగ్గించడంపై కీటక శాస్త్ర నిపుణులు కృషి చేయాలని సూచించారు. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఎంతో అవసరమని అన్నారు. వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. పంటల సస్యరక్షణ సంబంధించిన అంశాలను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో రైతులు తక్కువ సమయంలో ఛీడ, పీడల నివారణ చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. పురుగు మందుల వాడకంలో మనం ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే వాడుతున్నామని, పురుగు మందుల దుర్వినియోగం జరుగకుండా తగిన సాంకేతిక సలహాలు రైతులకు అందించాలని సూచించారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచడంతోనే తమ పని అయిపోయిందని శాస్తవ్రేత్తలు భావించరాదని, అభివృద్ధిపరిచిన సాంకేతిక పరిజ్ఞానానికి మార్కెటింగ్ కల్పించినప్పుడే అది సార్థకమవుతుందని అన్నారు. సస్యరక్షణ యాజమాన్యానికి సంబంధించిన సేవల విస్తరణలో డిజిటల్ టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవాలని శాస్తవ్రేత్తలకు సూచించారు. ఎంటమాలజీ సింపోజియంలో భాగంగా ప్రచురించిన సావనీర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని వైఎస్ సర్కార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హెచ్‌సీ శర్మ, డాక్టర్ కృష్ణకుమార్, డాక్టర్ అనితా కోడూరు, డాక్టర్ టివీకే సింగ్, డాక్టర్ బెంటూరు, డాక్టర్ జెల్లా సత్యనారాయణ పాల్గొన్నారు.