రంగారెడ్డి

కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, డిసెంబర్ 10: నేడు మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ కీసర సమీపంలోని హోలీమేరీ కళాశాలలో నిర్వహిస్తున్నందున పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. పోలీసు అధికారులతో సీపీ కేబీఆర్ గార్డెన్‌లో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, రాచకొండ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, కౌంటింగ్ సెంటర్లలోకి పాస్‌లు ఉన్న వారిని, వాహనాల తనిఖీలు నిర్వహించి లోపలికి అనుమతించాలని అన్నారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశామని, భద్రతా బలగాలు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, కేంద్ర బలగాల నిఘా నీడలో కౌంటింగ్ నిర్వహిస్తామని వివరించారు. మంగళవారం ఎలాంటి సభలు, ర్యాలీలకు అనుమతులు లేవని స్పష్టం చేసారు. కౌంటింగ్ కేంద్రాలకు పాస్ హోల్డర్స్‌కు మాత్రమే అనుమతి ఉందని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం ఏడు గంటల లోపు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్, వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టె, లైటర్ వంటి నిషేధిత వస్తువులు లోపలికి తీసుకురాకూడదని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుల సూచనలు, సలహాలు పాటించి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ముందుగా హోలీమేరీ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. కార్యక్రమంలో డీసీపీలు ఉమామహేశ్వర శర్మ, పద్మజ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

వాసవిక్లబ్‌కు బెస్ట్ క్లబ్ అవార్డులు
షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 10: వాసవిక్లబ్‌కు రెండు బెస్ట్‌క్లబ్ అవార్డులు లభించినట్లు షాద్‌నగర్ శాఖ అధ్యక్షుడు వాడకట్టు విజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం విజయవాడలో వాసవిక్లబ్ అంతర్జాతీయ సమావేశాన్ని అధ్యక్షుడు వాసుదేవరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని క్లబ్‌ల సభ్యులు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. 2018లో షాద్‌నగర్ వాసవిక్లబ్ నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి బెస్ట్ క్లబ్ అవార్డుతోపాటు రెండు ఉత్తమ అవార్డులు వచ్చినట్లు అధ్యక్షుడు వాడకట్టు విజయ్‌కుమార్ తెలిపారు. బెస్ట్ డిప్యూటి గవర్నర్ అవార్డును దొంతు పాండురంగయ్య కైవసం చేసుకున్నట్లు వివరించారు. అవార్డులను క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు వాసుదేవ రావు చేతుల మీదుగా తీసుకున్నట్లు షాద్‌నగర్ వాసవిక్లబ్ అధ్యక్షుడు వాడకట్టు విజయ్‌కుమార్ తెలిపారు. మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు వాసవిక్లబ్ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. క్లబ్ సభ్యులు వెంకటరమణ, సూరిశెట్టి నర్సింహా, పోల శశీధర్, నందకిశోర్, గుబ్బ స్వామి, ఎలుకుర్తి శ్రీనివాస్, కట్టా ప్రవీణ్, పాండు పాల్గొన్నారు.