రంగారెడ్డి

నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, డిసెంబర్ 10: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు తేలనున్నాయి. ప్రధాన పార్టీల నాయకులతో పాటు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పని చేసిన తీరుతో పాటు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలించుకుంటూ గెలుపు ఓటమిలపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ముద్దగోని రామ్మోహన్ గౌడ్, ప్రజాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పేరాల శేఖర్ రావు, బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా మామిడి రాంచందర్ ఎన్నికల బరిలో నిలిచారు. రెండు నెలలుగా తమ తమ పార్టీల అజెండాలతో పాటు వ్యక్తిగత పరిచయాలతో వ్యూహాలు, ప్రతివ్యూహాలతో గెలుపునకు ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లకు చేరవయ్యారు. పోలింగ్ రోజు ఓటర్లను అనేక రకాల ప్రలోభాలకు లోనుచేసి ఎవరికీ వారు తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు. నాలుగు రోజుల నుంచి తమ గెలుపు ఓటమిలపై ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలిపిన సమాచారంతో పాటు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళి, ఓట్ల శాతం పెరుగుదల, తగ్గుదలను బట్టి ఎవరికివారు గెలుపు ఓటమిలను అంచనా వేసుకుంటూ తమ విజయం ఖాయమని అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెరాస గెలుపు ఖాయమని జాతీయ మీడియా సంస్థలు సర్వేల ద్వారా వెల్లడిస్తుండంతో ఎల్బీనగర్‌లోని తెరాస శ్రేణులు ఆనందంలో తేలుతూ విజయోత్సవ వేడుకలకు సిద్ధంగా వున్నారు. ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, ఎల్బీనగర్‌లో టీడీపీ పొత్తుతో పాటు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఓట్లు తమకే అధిక శాతం మొగ్గు చూపారని తాము విజయం సాధిస్తామని ప్రజాకూటమి నాయకులు కొండంత విశ్వాసంతో వున్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పేరాల శేఖర్ రావుకు జాతీయ నాయకుడిగా గుర్తింపు లభించిందని, దేశ ప్రధాని నరేంద్రమోడీకీ సన్నిహితుడు కావడంతో ఈ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎల్బీనగర్ ప్రజలు బీజేపీకి నిశ్శబ్దంగా ఓట్లు వేశారని తాము కూడా విజయం సాధించడం ఖాయమని నాయకులు విశ్వాసంతో ఉన్నారు. ఎల్బీనగర్‌లో అభ్యర్థుల భవితవ్యాలు నేటితో తేలనున్నాయి. ఏ పార్టీ అభ్యర్థి అయినా స్వల్ప మెజారిటీతో విజయం సాధించవచ్చని విశే్లషకులు భావిస్తున్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుపొందినా ఈ ప్రాంతం అభివృద్ధికి పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారు.