రంగారెడ్డి

మాజీ మంత్రులను ఓడించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆనంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 11: వికారాబాద్ నియోజకవర్గంలో బరిలో నిలిచిన ఇద్దరు మాజీ మంత్రులను తాజా అభ్యర్థి ఓడించాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న గడ్డం ప్రసాద్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌లను గతంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండి వైద్య వృత్తిలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ఓడించారు. నియోజకవర్గంలో లక్షా 51వేల 969 ఓట్లు పోలవగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆనంద్‌కు 59971, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు 56879, స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌కు 23908 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఆర్.సాయికృష్ణకు 1973, నోటాకు 1511 ఓట్లు రాగా, 14 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆనంద్ 3092 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయం సాధించడంతో శ్రీ అనంతపద్మనాభస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
పట్నం బ్రదర్స్‌లో ఒకరు ఓటమి
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన పట్నం బ్రదర్స్‌లో ఒకరే విజయం సాధించారు. తాండూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆపద్ధర్మ రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలవగా, కొడంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మహేందర్ రెడ్డి తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు.
జిల్లాలో ఓటమి పాలైన ముగ్గురు తాజా, మాజీ మంత్రులు
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన ఒక తాజా మాజీ మంత్రితో పాటు ఇద్దరు మాజీ మంత్రులు ఓటమి పాలయ్యారు. వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, ఇదే నియోజకవర్గంలో నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, తాండూర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తాజా మాజీ రవాణ శాఖ మంత్రి డాక్టర్ పీ.మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.
మరోసారి రుజువైన వికారాబాద్ మాజీలకు గెలుపు దూరం
వికారాబాద్ నియోజకవర్గంలో మాజీలు గెలవరనేది మరోసారి రుజువైంది. ఉప ఎన్నికలో విజయం సాధించిన గడ్డం ప్రసాద్‌కుమార్ 2009 ఎన్నికల్లో విజయం సాధించి, 2014 ఎన్నికల్లో అపజయం పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్‌కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా చంద్రశేఖర్ పోటీలో నిలిచి అపజయం పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ గెలుపొందారు. మొత్తం మీద మాజీలను వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆమోదించరనేది మరోసారి నిరూపణ అయింది.