రంగారెడ్డి

14 ఏళ్ల నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 11: ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 14 ఏళ్ల పాటు నిరీక్షణే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం వరించిందని బేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలుబడిన అనంతరం విజయఢంకా మోగించిన బేతి విలేఖరులతో మాట్లాడుతూ కారు..కేసీఆర్‌కే తన విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. నాటి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పని చేస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్తున్నానని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి స్థానికుడు కాదని, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, అందుకే ప్రజలు వారిని నమ్మకుండా నిరంతరం ప్రజల్లో తిరిగే తనపై విశ్వాసంతో భారీ మెజారీటితో గెలిపించారని, ఇది ప్రజా విజయం అని అభివర్ణించారు.
ఓటరు తీర్పుకు శిరసావహిస్తా
* ప్రజా సేవకే పునరంకితం: వీరేందర్ గౌడ్
ఉప్పల్, డిసెంబర్ 11: గెలుపు, ఓటములు ప్రజా జీవితంలో సహజం. ఓటరు తీర్పుకు చిరసావహించి నిత్యం ప్రజాసేవకే అంకితమవుతానని ఓటమి చెందిన తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు. గెలిపిస్తే నియోజకవర్గం ప్రజలకు ఎన్నో చేయాలనుకున్నానని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పినా ఆదరించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన వీరేందర్ గౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలువకపోయినా తన కోసం రాత్రింబవళ్లు శ్రమించి పని చేసిన పార్టీ శ్రేణులు, నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మల్లారెడ్డి ఘన విజయంతో సంబురాలు
ఘట్‌కేసర్, డిసెంబర్ 11: టీఆర్‌ఏస్ మేడ్చల్ అభ్యర్ధి చామకూర మల్లారెడ్డి అత్యధిక మెజారిటీ సాదించి ఘన విజయం సాదించటంతో మండల టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం సంబురాలు జరుపుకున్నారు. మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి మాట్లాడుతు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ, ఆర్ధిక పథకాలే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు భారి మెజారిటీ అందించినట్లు తెలిపారు. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ మళ్లి ముఖ్యమంత్రి కావటం తెలంగాణ ప్రజల అదృష్టమని చెప్పారు. టీఆర్‌ఎస్ మండల సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు బైనగారి నాగరాజు, కీసరగుట్ట ఆలయ కమిటీ డైరక్టర్ తరిణే మహింధ్రాచారి, సహకార సంఘం డైరక్టర్లు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు నర్సింగ్‌రావు, జంపాల రమేశ్, కొండల్‌రెడ్డి, బొడిగే శ్రీనివాస్‌గౌడ్, చందుపట్ల వెంకట్‌రెడ్డి, నల్లవెల్లి శేఖర్, జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.