రంగారెడ్డి

శేరిలింగంపల్లి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, డిసెంబర్ 12: తనపై నమ్మకంతో ఆదరించి రెండోసారి గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం బుణపడి ఉంటానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. రెండో పర్యాయం తనను గెలిపించినందుకు నాకు మరింత బాధ్యత పెరిగిందని అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానని బుధవారం ఆంధ్రబూమితో మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మొదటి దఫా రూ.4వేల కోట్ల వ్యయంతో ఎంతో అభివృద్ధి చేశానని వివరించారు. మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన 18 తాగునీటి రిజర్వాయర్‌లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి అన్ని ప్రాంతాలకు తాగునీటి పైపులైన్లు వేసి ఇంటింటికీ నల్లా నీరు అందించే పనులను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ వాగ్ధానం చేశారు. పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం, రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరిచి స్వచ్ఛ భారత్‌లో భాగస్వాములవుతామని పేర్కొన్నారు. వరదనీటి ముంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టిన పనులు కొనసాగుతున్నాయని, వచ్చే వర్షాకాలం వరకు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం పరిధిలో వౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు.
తెలంగాణ కమ్మ సంఘం శుభాకాంక్షలు
శేరిలింగంపల్లి, డిసెంబర్ 12: శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన ఆరెకపూడి గాంధీని తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. బుధవారం తెలంగాణ కమ్మ సంఘం అధ్యక్షుడైన గాంధీని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అత్యధిక మెజారిటీ సాధించిన శాసనసభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.