రంగారెడ్డి

కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, డిసెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని టీఆర్‌ఎస్ జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షుడు కోనేరు నర్సింగ్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నర్సింగ్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ని మళ్లీ గెలిపించాయని అన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని వివరించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేగా రెండవసారి ఎన్నికైన అంజయ్య యాదవ్ నాయకత్వంలోనే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించామో అదే తరహాలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. వర్కింగ్ ప్రసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సయ్యద్ హాఫీజ్, శ్రీ్ధర్‌రెడ్డి, దర్గా రాంచంద్రయ్య, యాదయ్య, వీరన్న, పెద్దకుర్వ గోపాల్, శంకరప్ప పాల్గొన్నారు.
కేటీఆర్ ఎన్నిక పట్ల హర్షం
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావును ఎన్నిక చేయడం పట్ల స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కొందుర్గు మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ పటేల్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షునిగా కల్వకుంట్ల తారక రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి 99 కార్పొరేట్ స్థానాలను గెలిపించిన కేటీఆర్, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు శ్రీ్ధర్ రెడ్డి, గోపాల్, సున్నాల శ్రీను, ప్రసాద్, దుర్గని శ్రీను, నిరంజన్, సాయి, పద్మారావు, ఖాజాపాషా, బబ్లూ, సచిన్, దేవయ్య పాల్గొన్నారు.

ఎంపీ పదవీకి రాజీనామా చేసిన మల్లారెడ్డి
మేడ్చల్, డిసెంబర్ 14: సాధారణ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన క్రమంలో చామకూర మల్లారెడ్డి శుక్రవారం తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారు. మల్కాజిగిరి ఎంపీగా ఉంటూనే మల్లారెడ్డి.. అధిష్టానం నిర్ణయం మేరకు మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మోజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారు. దిల్లీలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కార్యాలయంలో కలిసి మల్లారెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌కు మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.