రంగారెడ్డి

నర్సరీలను సందర్శించిన రాష్ట్ర విజిలెన్స్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, డిసెంబర్ 14: శుక్రవారం కీసర మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను రాష్ట్ర విజిలెన్స్ బృందం పరిశీలించారు. రాంపల్లి దాయర, గోధుమకుంట, కరీంగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసారు. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో ప్రజలకు అవసరమైన మొక్కలను నాటాలని తెలిపారు. ప్రతి గ్రామంలో తప్పని సరిగా నర్సరీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన మొక్కలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఈస్ నిధులతో రైతులు వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకునేలా మండల స్ధాయి అధికారులు రైతులకు వివరించాలని, వ్యవసాయ శాఖ అధికారులు విధిగా రైతులకు తెలపాల్సిన బాధ్యత వారిపై ఉందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్‌ఆర్‌ఈజీఎస్ విజిలెన్స్ ఏఈఓలు టీ.నిరంజన్, కే.రమణ, ఎంవీఎస్ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో సువిధ, గోధుమకుంట ప్రత్యేక అధికారి హమ్‌దాని, పద్మావతి, మహేశ్ పాల్గొన్నారు.

అంజన్నకు మంత్రి పదవి ఇవ్వాలి
షాద్‌నగర్, డిసెంబర్ 14: స్థానిక శాసన సభ్యుడు ఎల్గనమోని అంజయ్య యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని యాదవ సంఘం యూత్ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ యాదవ్ అన్నారు. శుక్రవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో దామోదర్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక అసెంబ్లీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎల్గనమోని అంజయ్య యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేయాలని పేర్కొన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలన విభాగంలో అపార అనుభవం ఉన్న వ్యక్తిగా అంజయ్య యాదవ్‌కు మంచి పేరు ఉందని, అందుకే మంత్రి పదవి ఇచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి చిత్తశుద్ధితో పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వ్యక్తి అంజన్న అని పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 17వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించగా 2018లో రెండవ సారి 20425ఓట్ల మెజారిటీతో అంజయ్య యాదవ్ విజయం సాధించారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ యాదవ్, బాలు యాదవ్, మహేష్ యాదవ్, కావలి అశోక్ యాదవ్, సంజీవ యాదవ్, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.