రంగారెడ్డి

హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపితే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 14: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీటుబెల్ట్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి డాక్టర్ నెల్లూరు వాణి హెచ్చరించారు. శుక్రవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వ్యవసాయం నిమిత్తం రైతులు వినియోగించే ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని, రైతులు దళారీలను ఆశ్రయించకూడదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించనున్నామని తెలిపారు. అవగాహనలో విద్యార్థులు విన్న విషయాలను ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెబితే అపుడైనా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని అభిప్రాయపడ్డారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, పరిమితికి మించి బరువులతో వాహనాలు నడపడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతులకు కారణమైన వాహనాలను విక్రయించి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కింద ఇచ్చే నిబంధన వచ్చిందని వెల్లడించారు. 18 సంవత్సరాల వారికి లైసెన్స్ జారీ కాదని, చిన్న పిల్లలు ట్రిపుల్ రైడింగ్ చేయడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీ నుండి ప్రత్యేకంగా విజిలెన్స్ తరహాలో వాహన తనిఖీలు చేపడతామని, హెల్మెట్ లేకుండా నడిపిన వాహనదారులకు మొదటిసారి జరిమానా, రెండోసారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని వివరించారు. వాహన చోదకులు లైసెన్స్, బీమా, ఆర్‌సీలు లేకుండా వాహనాలను రోడ్డుపైకి తేవద్దని అన్నారు. తమ కార్యాలయంలో 59 సేవలు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని పొందవచ్చని, దళారీలను ఆశ్రయించకుండా నేరుగా హెల్ప్‌డెస్క్ ద్వారా పనులు పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నిబంధనలు ఎవరికోసమో అనుకోకుండా ఎవరికి వారు మనకోసమే అని భావించాలని హితవు పలికారు. వాహనాలు నడుపుతున్నపుడు కాల్ వస్తే వాహనం నడుపుతున్నట్లు కాల్ చేసిన వారికి తెలిసే యాప్ వచ్చిందని, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వికారాబాద్, తాండూర్, పరిగి కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు.

భారీ వర్షంతో జలమయమైన రహదారులు

జీడిమెట్ల, డిసెంబర్ 14: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురవడంతో రహదారులన్ని జలమయమయ్యాయి. నియోజకవర్గంలోని గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, రంగారెడ్డి నగర్, సూరారం, సుభాష్‌నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్‌లతో పాటు దుందిగల్, గాగిల్లాపూర్, దొమ్మరపోచంపల్లి, గండిమైసమ్మ, బౌరంపేట్, మల్లంపేట్, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, బహద్దూర్‌పల్లి, దూలపల్లి, కొంపల్లి గ్రామాలలో గురువారం రాత్రి నుండి తెల్లవారుజామున వరకు వర్షం కురిసింది. గండిమైసమ్మ, సూరారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాలలోని ప్రధాన రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంతల మయమైన రోడ్లలో వరద నీరు నిండడంతో ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక స్థానికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు.
చిన్న పాటి వర్షానికే ఇళ్లలోకి నీరు
నేరేడ్‌మెట్: వర్షాకాలం వచ్చిందంటే ఆ ప్రాంతాలలో నివసించే వారంతా బిక్కుబిక్కు మంటూ జీవించాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి సమస్యవల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా ఇళ్లలోకి నీరు చేరడంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని మల్కాజిగిరి బండ చెరువు పరిసర ప్రాంతంలో నివసించే కాలనీ వాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సర్కిల్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్, ఎన్‌యండీసీ కాలనీ, షిరిడీనగర్, రాజానగర్, బాలసరస్వతినగర్ కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. బండ చెరువు దిగువ కాలనీలైన ఈస్ట్ ఆనంద్‌బాగ్ కాలనీ మధ్యలో నుండి చెరువు నీరు వెళ్లేందుకు నాలా ఉండడంతో నాలా నీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వస్తే వర్షపు నీరు నాలాలో ప్రవహించి పొంగి ఇళ్లలోకి నీరు వస్తుందని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.