రంగారెడ్డి

భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు: వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంగళవారం కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, శ్రీ్భదేవిల కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారికి దాత శివరంజిత్‌కుమార్ గుప్త పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నందిగామ మండలం మామిడిపల్లిలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందర్భంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.
షాబాద్: భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని దైవాలగూడలో శ్రీవెంకటేశ్వర స్వామి, షాబాద్, సీతారాంపూర్ గ్రామాల్లోని సీతారామ చంద్రస్వామి ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ఏకదశి పూజలు నిర్వహించారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి పాలభిషేకం నిర్వహించారు.
కొడంగల్: కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు జరుగుతున్నాయి. నెల రోజుల పాటు జరిగే పూజల్లో భాగంగా ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు. దరూరీ శ్రీనివాస చార్యులు తిరుప్పావై పారాయణం చదివి వినిపిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులను మాడావిధుల గుండా అంగరంగ వైభవంగా అలంకరించి ఊరేగించారు.
మహేశ్వరం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం మండల పరిధి శ్రీనగర్‌లోని బాలాజీ వేంకటేశ్వర స్వామి, సర్దార్‌నగర్ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి పూజల్లో మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు. ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పరిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని నేడు దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీఎన్జీవోస్ కాలనీ, వట్టేపల్లి, మామిడిపల్లిలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ టీ.ప్రేమ్‌దాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
షాద్‌నగర్: ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు వైభవంగా సాగాయి. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి భక్తులు, ప్రజాప్రతినిధులు ముక్కోటి దేవతలను దర్శించుకున్నారు. షాద్‌నగర్ పురపాలిక సంఘం పరిధిలోని జానంపేటలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్, టీడీపీ జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు బక్కని నర్సింలు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, ఫరూఖ్‌నగర్ మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం తెల్లవారు ఝము నుంచే భక్తుల సందడి నెలకొంది. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు క్యూలైన్ల ద్వారా పంపించేందుకు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా ట్రాఫిక్ నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, నందిగామ, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే ఏడాది మొత్తం శుభం జరుగుతుందనే ప్రగాఢ నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో ఆయా దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పంచాయతీ శివారులోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు నిర్వహించారు. శ్రీమహావిష్ణువు రూపంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు ఝాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.
కొందుర్గు: ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంగళవారం కొందుర్గు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈవో నరేందర్ ఆధ్వర్యంలో ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారు ఝాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
కీసర: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మండలంలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చీర్యాల లోని శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో పండితులు స్వామి వారికి పంచామృత అభిషేకాలు, సుదర్శన హోమం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు సప్తద్వారాల లోనుంచి వెళ్లి, ఉత్తర ద్వారం గుండా శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ కలెక్టర్ దంపతులకు స్వామి వారి శేషవస్త్రాన్ని కప్పి, ప్రసాదాన్ని అందజేశారు. నాగారంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా కాలనీ వాసులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లు చేసారు.
బాలాపూర్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని బాలాపూర్ మండల పరిధిలో గల పలు ఆలయాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.