రంగారెడ్డి

ఎక్కడ చూసినా చలి మంటలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 18: అసలే చలికాలం..పైగా పెథాయ్ తుఫాన్..కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు..ఈదురు గాలులకు బయటకు రాలేని జనం ఇళ్ల తలుపులు, కిటికీలన్నీ బిగించినా ఆగని చలి. ఈ పరిస్థితులలో స్కూళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు చలికి తట్టుకోలేక గజ గజ వణుకున్నారు. ఇంతటి చలిలోనూ హాస్కళ్లలోని పిల్లలు చన్నీటి స్నానాలే..మంగళవారం సైతం చల్లని వాతావరణం ప్రతి ఒక్కరిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు కన్పించలేదు. ఆకాశమంతా మేఘావృతమై చిరు జల్లులు కురవడంతో వర్షాకాలం తలపించింది. సందడి కన్పించే పట్టణంలోనూ తుపాను ప్రభావం స్పష్టంగా కన్పించింది. రహదారులు నిర్మానుషంగా కన్పించగా ఎక్కడ చూసినా చలి మంటలే దర్శనమివ్వడంతో సంక్రాంతి పండుగకు ముందుగానే బోగి మంటల దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. గత మూడు రోజులుగా ఇదే చల్లని వాతావరణం కన్పిస్తుండటంతో తీవ్రమైన చలితో వణుకుతుండగా చిన్నారులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రక్షణ కవచాలు లేనిదే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం చల్లబడటంతో అత్యవసర పనులు తప్ప జనం బయటకు రాలేకపోతున్నారు. వెచ్చని వాతావరణం కోసం ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించారు. చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్ల కోసం దుకాణాల దారి పట్టారు. పట్టణంలో ఎక్కడ చూసినా స్వెట్టర్ల కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన షాపుల యజమానులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అయినా చలి నుంచి రక్షణ పొందేందుకు కొనుగోలు చేయక తప్పడంలేదు.
షాబాద్: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రెండు రోజులుగా మండలంలో తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు, విపరీతమైన చలి పెరిగింది. పెద్దగా వర్షాలు లేకపోయినప్పటికీ ఉదయం నుండి సాయంత్రం వరకు చలితో కూడిన గాలి, ఆకాశం మేఘామృతమై ఉండి పొగమంచు దట్టంగా దాపురించడంలో ప్రయాణికులకు శాపంగా మారింది. పగలే కారుమబ్బులు కమ్మిన కారణంగా తెల్లని మంచు వాతావరణంలో వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలు నడిపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలనుండి పని కోసం వలస వచ్చిన కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. చాలమంది రైతులు పత్తి పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వలన పత్తి నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షం కురిస్తే పూర్తిగా పత్తి పంటలు పాడైపోతాయని రైతులు బిక్కుబిక్కు మంటున్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు
తుఫాన్ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఉదయం లేచి 9 గంటల వరకు పాఠశాలలకు చేరుకోవాలి. ఉదయం బాగా ఈదురుగాలితో పాటు చలి ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల తరగతి గదులకు సరైన వౌలిక వసతులు లేకపోవడంతో చలితో గజగజ వణికిపోతున్నారు. పాఠశాలల యాజమాన్యం దీనిపై దృష్ఠి సారించడం లేదు. విద్యార్థులు చలిలో పాఠశాలలకు రావడంతో కొందరు అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షాద్‌నగర్ రూరల్: పెథాయ్ తుపాను కారణంగా విస్తున్న చలి గాలుల కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గత మూడు రోజుల నుంచి చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చలిగాలుల నుంచి తట్టుకునేందుకు స్వెటర్లు వైపు ప్రజలు పరుగులు తీస్తున్నారు. వృద్ధులు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు ఎక్కువగా అసక్తి చూపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లలేక ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. పాడి రైతులు చలిగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. షాద్‌నగర్ ప్రధాన రహదారులు ఎప్పుడు జనంతో కిక్కిరిసి ఉండేవి.. కానీ పెథాయ్ తుపాను కారణంగా వీస్తున్న చలిగాలులకు రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సూర్యుడు ఎప్పుడు వికసిస్తాడు..ఎండ ఎప్పుడు వస్తుందని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గత మూడు రోజుల నుంచి చల్లని గాలులు వీయడంతోపాటు ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. చలి తీవ్రతకు ప్రజలే కాకుండా మూగజీవాలు సైతం గజగజ వేణికిపోతున్నాయి. వీటి రక్షణకు రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత నుంచి తట్టుకునేందుకు స్వెటర్లు, దుప్పట్లు కుప్పుకొని ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే ఆధునుగా భావించిన వ్యాపారులు ఉలన్ వస్తువులకు ఒక్కసారిగా ధరలు పెంచారు. దాంతో ఎలా కొనుగోలు చేయాలంటూ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారు ఝాము నుంచి ఉదయం పది గంటల వరకు మంచు కురుస్తున్న నేపధ్యంలో చలి ఎక్కువగా పెరిగిపోయింది. ఎప్పుడు లేని విధంగా చలి ఎక్కువగా ఉండటంతో తట్టుకునేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లులు ఎప్పుడు స్వెటర్లు, దుప్పట్లు ధరించి ఉంటున్నారు. చలి తీవ్రత ఇదే విధంగా కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. చలి భారి నుంచి విముక్తి పొందేందుకు వేడివేడి ఆహార పదార్థాలు తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
చలితో పొంచి ఉన్న వ్యాధులు
చలి తీవ్రత కారణంగా వ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుణంగా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. బయటకు వెళ్లే వారు తప్పని సరిగా స్వెటర్లు వాడాలని, చిన్న పిల్లలు, వృద్ధులు తప్పని సరిగా ఉన్నీ దుస్తువులు ధరించాలని తెలిపారు. అస్మా కలిగిన రోగులు, చిన్న పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. చలి గాలుల కారణంగా స్వైన్‌ఫ్లూ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఈ వ్యాధి భారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చలి తీవ్రత కారణంగా వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు.
రాజేంద్రనగర్: పెథాయ్ తుఫాన్ తాకిడి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో రాజేంద్రనగర్ పరిధిలో ఉష్ణోగ్రతలు తగ్గి చలితో ప్రజలు వణికిపోతున్నారు. సోమవారం చల్లటి వాతావరణం ప్రారంభమై మంగళవారం అలాగే కొనసాగింది. భానుడు కనిపించకపోవడంతో ఆకాశమంతా మేఘావృతమై చిరుజల్లులు కురుస్తుండడంతో వర్షాకాలాన్ని తలపించింది. వర్షం, చలికితోడు ఈదురుగాలులు జతవడంతో ప్రజలు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఎదురైంది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. రక్షణ కవచాలు లేనిదే అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. వర్షం అంతగా లేకున్నా ఈదురుగాలులు భయభ్రాంతులకు గురి చేశాయి. గతంల3 ఎన్నడూ లేనట్లుగా సూర్యడు మబ్బుల నుంచి బయటకు రాకపోవడంతో జనాలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. రక్షణ కవచాలు లేకుండా బయటకు రావద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.