రంగారెడ్డి

కూటి కోసం వెళితే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, డిసెంబర్ 18: తానోకటి తలిస్తే దైవం ఒకటి చేసింది అనే చందంగా ఓక నిరుపేద మహిళ ఉదంతం మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణ శివారులోని యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్ చౌరాస్తా ప్రాంతంలో కోనసాగుతున్న పాల ఉత్పత్తి కేంద్రంలో గత కొన్ని నెలలుగా పనికి వెలుతున్న మహిళ వడ్ల అనురాధ ప్రమాదవశాత్తు పశువుల మేత, చోప్పను నరికే యంత్రంలో మేతను కట్ చేస్తుండగా కుడి చేయి యంత్రంలోకి దూసుకు పోయింది. దాంతో ఆమె కుడి చేయి యంత్రంలో చిక్కుకొని చేతి వేళ్లు అరచేయి నుజ్జు నుజ్జు అయింది.
పాల కేంద్రం నిర్వాహాకులు పోట్ట కూటి కోసం కేంద్రం నిర్వాహాకులకు వంట పని చేయడానికని పిలిపించి ఇతర పనులు చేయించుకోవటంతో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందని బాధితురాలు అనురాధ బంధువులు ఆరోపిస్తున్నారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన వడ్ల అనురాధ, బోర్ర నాగమణి గత కొన్ని నెలలుగా ఈ పాల ఉత్పత్తి కేంద్రంలో పని చేస్తున్నారు. బాధితురాలు అనురాధ చేయి కోల్పొవటంతో పాల కేంద్రం నిర్వాహాకులు ఆమెను గుట్టు చప్పుడు కాకుండా తాండూరు పట్టణంలోని ఓక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. అక్కడి డాక్టర్లు ప్రథమ చికిత్సలు చేసి అనురాధ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దాంతో ఆమెను హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం చేయిస్తున్నట్లు సమాచారం. నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం
రాజేంద్రనగర్, డిసెంబర్ 18: ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో మంటలంటుకొని ఓ గోడౌన్ కాలిబూడిద అయిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారులోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని నేషనల్ ప్లాస్టిక్ స్క్రాప్ రిసైక్లింగ్ గోడౌన్‌లో తెల్లవారుజామున చిరు జల్లులు పడుతున్న సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకోవడంతో పక్కనే ఉన్న ప్లాస్టిక్ వస్తువులు అంటుకున్నాయి. గోడౌన్‌లోని ప్లాస్టిక్ ముడిసరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తుంది.