రంగారెడ్డి

వ్యవసాయ రంగంలో స్వయంసమృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 18: భారతదేశం నేడు ఆహార లభ్యత విషయంలో పూర్తి స్వయం సమృద్ధి సాధించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. ఇక నుంచి ఫుడ్ ప్రాసెసింగ్, విలువల జోడింపు, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేయడం గురించి పరిశోధనలు చేయాలని సూచించారు. హైటెక్‌సిటీలోని హోటల్ ఐటీసీ కోహినూర్‌లో జరుగుతున్న అగ్రివిజన్ సదస్సులో శుక్రవారం పాల్గొన్నారు. సీఐఐ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కార్నెల్ విశ్వవిద్యాలయంలు సంయుక్తంగా సదస్సును నిర్వహించాయి. రెండు రోజుల పాటు ఎనిమిది అంశాలపై సదస్సులో శాస్తవ్రేత్తలు, రైతులు, పరిశ్రమల ప్రతినిధులు చర్చలు జరిపారు. సదస్సు శుక్రవారం ముగిసింది. ఒకప్పుడు ఆహార ధాన్యాల్ని భారతదేశం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని అన్నారు. కానీ, నేడు ఉత్పాదకతలు పెరిగి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగామని చెప్పారు. ప్రస్తుతం రైతులకి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని కూడా తమ ముందే ఇదే లక్ష్యాన్ని ఉంచారని చెప్పారు. లక్ష్యసాధన దిశగా అందరూ పని చేయాలని మహాపాత్ర అభిప్రాయపడ్డారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న పట్టణీకరణ, వాతావరణ మార్పులతో వ్యవసాయరంగం కూడా కొత్త కొత్త సవాళ్లని ఎదుర్కొంటుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. ప్రతి రైతూ పంట వసే ముందు పెట్టుబడి ఖర్చులు, ఎదురయ్యే ఇబ్బందులు, వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తారని చెప్పారు. రైతుల తమ అనుభవాల నుంచి అనేక కొత్త ప్రశ్నలు శాస్తవ్రేత్తల ముందు ఉంచతున్నారని పేర్కొన్నారు. వాటి గురించి పరిశోధించి రైతులకి అనుకూలమైన పరిష్కారాలు చూపించాలని అన్నారు. పరిష్కారాలు కనుగొనడంలో అధునాతన టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వినియోగించుకోవాలని సూచించారు. పశుపోషణ, ఉద్యాన పంటలతో కూడిన సమీకృత వ్యవసాయ పద్ధతులని ప్రోత్సహించాలని ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు.

రాజబొల్లారం తండాలో ఉపసర్పంచ్ ఎన్నికపై వివాదం
మేడ్చల్, జనవరి 18: మండలంలోని రాజబొల్లారం తండా ఉపసర్పంచ్ ఎన్నిక అంశమై శుక్రవారం గ్రామంలో వివాదం నెలకొంది. వివరాల ప్రకారం తండా సర్పంచ్, ఎనిమిది మంది వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సర్పంచ్‌గా మంగ్యా నాయక్‌కు అధికారులు గురువారం రాత్రి ధ్రువీకరణపత్రం కూడా అందజేశారు. ఉపసర్పంచ్ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. అధికారులు శుక్రవారం ఉపసర్పంచ్ ఎన్నికకు ఏర్పాట్లుచేసి 5వ వార్డు సభ్యుడు భుక్యా నరేశ్‌ను ఉపసర్పంచ్‌గా ఎన్నిక చేసే సమయంలో 6వ వార్డు సభ్యురాలు మాలావత్ రీతా అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఉపసర్పంచ్‌గా ఎన్నిక చేస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు నరేశ్‌ను ఎలా ఎన్నికుంటారని నిలదీశారు. దీంతో తండాలో గ్రామస్థులు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ కార్యాలయ వద్దకు చేరుకున్నారు. మూడు గంటల పాటు వివాదం సద్దుమణగపోవడంతో అధికారులు చేసేదిలేక నరేష్‌ను ఉపసర్పంచ్‌గా ఎన్నిక చేసి వెనుదిరిగారు. దీంతో మరో వర్గం నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. పాలకవర్గం ఏకగ్రీవమైన మొదటిరోజే గ్రామంలో వివాదం నెలకొనడం పట్ల గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన నాయకులు గొడవను జీర్ణించుకోలేకపోతున్నారు.