రంగారెడ్డి

రామానుజస్వామి సహస్రాబ్ది ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 18: మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామంలో వెలిసిన రామానుజ స్వామివారి సహస్రాబ్ధి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో వెలిసిన రామానుజస్వామి ఎంతో మహిమాన్వితం గల దేవునిగా కోరిన కోరికలు తీర్చే ఆరాధ్యుడుగా కొలువబడుతున్న, కోరికలు తీరుస్తూ భక్తులకు ఆభయమిస్తున్నాడు. వందల సంవత్సరాల నుండి గ్రామాన్ని చెడు ప్రభావం పడనీయకుండా పరిరక్షిస్తున్నాడని ప్రతీతి. గ్రామంలో రామానుజస్వామి ఆలయం ఉండటంతో కుల, మత, ధనిక, పేద భేదాలు లేని వైష్ణవ తత్వాన్ని ప్రజలు స్వచ్ఛందంగా అనుసరిస్తున్నారు. రామానుజ స్వామి జన్మించి వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి నెల అర్ధానక్షత్రం రోజున ఈ సంవత్సరమంతా శతకాల పాలాభిషేకం, సుదర్శనహవనం నిర్వహిస్తున్నారు. ఆలయంలో సహస్రాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గజ, హనుమ, శేష, గరుడవాహన సేవలను నిర్వహించారు. స్థానాచార్యులుగా అనూరి మరిగంటి వారు వ్యవహరిస్తుండగా, కుంతీపురం కుటుంబీకులు అర్చకులుగా స్వామివారిని సేవిస్తున్నారు. గౌడవెల్లి చేరుకోవాలనుకునే భక్తులకు సికిందరాబాద్ నుంచి లోకల్ రైలు, ప్యాసింజర్ రైలు సౌకర్యం కూడా ఉంది. 45 నిమిషాల ప్రయాణం బస్సు మార్గం, సికిందరాబాద్ నుంచి గౌడవెల్లికి 235జీ అనే ఆర్టీసీ బస్సులో కూడా రావచ్చు. ఆటోమార్గం మేడ్చల్ నుంచి మూడు కిలోమీటర్లు, కండ్లకోయ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది.

హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
కొందుర్గు, జనవరి 18: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. శుక్రవారం కొందుర్గు, జిల్లేడుచౌదరిగూడ మండల కేంద్రాలతో పాటు రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో నువ్వా..నేనా అన్న విధంగా ప్రచారాలు సాగిస్తున్నారు. కొందుర్గు మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి పటేల్ శివజ్యోతి, కాంగ్రెస్ నుండి అన్ని పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఆదిలక్ష్మి పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లకు చూపుతూ, తమ గుర్తులకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి.
బొంరాస్‌పేట: కొడంగల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. తమ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శుక్రవారం బొంరాస్‌పేట మండలంలో పర్యటించారు. మండల పరిధిలోని మహంతిపూర్ గ్రామానికి నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్లారు. జానంకంపల్లిలో ప్రచారం అనంతరం నరేందర్ రెడ్డి మహంతిపూర్ వెళ్లి ప్రచారం ముగించుకొని వెళ్లగా, రేవంత్ రెడ్డి మహంతిపూర్, గౌరారం, చౌదర్‌పల్లి, నాందార్‌పూర్, కాకర్లగండితండా, పూర్యనాయక్ తండా, కొత్తూర్, రేగడిమైలారం, ఎనే్కపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు మెంబర్ల గెలుపునకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పనిచేసే వారికి పట్టం కట్టాలని కోరారు. తండాల్లో ప్రచారానికి వచ్చిన రేవంత్‌ను గిరిజన మహిళలు ఆప్యాయంగా పలుకరించారు. నరేందర్ రెడ్డి వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, కోట్ల యాదగిరి పాల్గొన్నారు. రేవంత్ ప్రచారంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జయకృష్ణ, పార్టీ నాయకులు రాజేష్ రెడ్డి, నర్సిములు గౌడ్, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
శంషాబాద్: టీఆర్‌ఎస్‌తోనే పంచాయతీల ప్రగతి సాధ్యమని అలీకోల్ తండా సర్పంచ్ అభ్యర్థి రుక్మిణి నాయక్ అన్నారు. శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి హనుమంత్ నాయక్, బాబీయా, నర్సియా, జైనా, రవి, రమేష్, శాంతి, విజయ, లలితా, గోప్య, దోబి, గోరి పాల్గొన్నారు.

ఎన్టీఆర్ సేవలు మరువలేనివి
కేశంపేట, జనవరి 18: మండలంలో ఎన్‌టీ రామారావు వర్ధంతిని నిర్వహించారు. శుక్రవారం మండల పరిధిలోని కాకునూర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి కుమారస్వామి ఆధ్వర్యంలో రామారావు వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టీడీపీ మండల కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో టీడిపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొరిగె నారాయణ, శాంతయ్య, బాలస్వామి, లింగం, శంకరయ్య, రమేష్, మల్లేష్, చెంద రాజు, శివరాములు పాల్గొన్నారు.
వనస్థలిపురం: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పనామ చౌరస్తాలోని ఎన్‌టీఆర్ విగ్రహానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి హాజరై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మన్సూరాబాద్ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాంపల్లి రామేశ్వర్ ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించి ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ నాయకులు యంజాల జగన్, యాదయ్య, శ్రీనివాస్ రావు, రవి శంకర్, గాంధీ పాల్గొన్నారు.
ఉప్పల్: తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 23వ వర్ధంతిని పార్టీ డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్‌లోని చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఇంచార్జి తూళ్ల వీరేందర్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్ష