రంగారెడ్డి

ఓటు వేసేందుకు గ్రామాలకు పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 20: వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో సోమవారం మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సొంత గ్రామంలో ఓటు వేసేందుకు గ్రామంలో ఉన్నవారు సిద్ధంగా ఉండగా, ఉద్యోగం, వ్యాపారం, విద్యల కారణంగా వివిధ ప్రాంతాలలో ఉండిపోయిన వారు ఆదివారం స్వగ్రామాలకు పయనమయ్యారు. భారీ సంఖ్యలో ప్రయాణం కొనసాగిస్తుండటంతో హైదరాబాద్ నుంచి తాండూర్ వైపు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోయాయి. తాండూర్ వైపు వెళ్లే రైళ్లు సైతం జనంతో కిటకిటలాడాయి. కొడంగల్ వైపు రైలు సౌ కర్య ం లేకపోవడంతో బస్సులో ఇక్కట్లు పడుతూ ప్రయాణించారు. మొత్తం మీద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది.
గ్రామస్థుల సహకారంతో అభివృద్ధి
వికారాబాద్, జనవరి 20: గ్రామస్థుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ అభ్యర్థి షకేరా బేగం అన్నారు. ఆదివారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు. భారీ మెజారిటీతో తనను గెలిపిస్తే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పెండ్లిమడుగులో బుచ్చిరెడ్డి ప్రచారం
వికారాబాద్, జనవరి 20: వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుచ్చి రెడ్డి ప్రచారం ఊపందుకుంది. ప్రతిరోజు ఉదయం, సాంయంత్రం వేళ తన ప్యానెల్‌తో ప్రచారం నిర్వహిస్తున్నాడు. మండల సమావేశాల్లో అధికారులను నిలదీసి సమస్యలు పరిష్కరించి, ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులతో నిధులు సమీకరిస్తామని పేర్కొన్నారు.
దళిత మోర్చా సమావేశంలో పాల్గొన్న సాయికృష్ణ
వికారాబాద్, జనవరి 20: మహరాష్టల్రోని నాగ్‌పూర్ భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న దళిత మోర్చా జాతీయ సమావేశంలో బీజేలీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ఆర్.సాయికృష్ణ పాల్గొన్నారు. అనంతరం మహల్ నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడాఫీస్‌ను, మ్యూజియంను సందర్శించారు.
గోధుమగూడను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
వికారాబాద్, జనవరి 20: తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ అభ్యర్థి ఏనుగు సౌజన్య అన్నారు. ఆదివారం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలకు బొట్టు పెట్టి ఓటు అభ్యర్థించారు. మాట్లాడుతూ, గ్రామస్థులకు కనీస వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు. మంచినీటి వసతి, మురికి నీటి కాలువలు, రోడ్లు, వీధిదీపాలు సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రవాణ సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామానికి భారీ నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని వివరించారు. ప్రచార కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.