రంగారెడ్డి

అన్నా.. ఓటేసి పోరాదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జనవరి 20: అన్నా నమస్తే.. బాగున్నవా.. గుర్తు పట్టినవా నేనే పలానా యాదగిరిని మాట్లాడుతున్న.. ఈసారి ఎన్నికలల్ల మన గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా.. ఒక్కసారి అమ్మానాయనలు, పిల్లలతో ఊరికొచ్చి నాకు ఓటేసి పోరాదె.. ఖర్చులు గట్రా ఏమైనా ఉంటే నేను చూస్కుంటా.. అంటూ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వలస ఓటర్లకు ఫోన్లలో గాలం వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని శివారు గ్రామాల ప్రజలు ఎంతోమంది ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల పేరిట నగరానికి వలసవెళ్లి స్థిరపడ్డారు. చాలామంది ఎప్పుడో గ్రామాలను విడిచి వెళ్లి నగరంలోనే ఉంటున్నారు. స్థానిక ఎన్నికల్లో వారి ఓట్లే కీలకంగా మారాయి. ఏ ఎన్నికల్లోనైనా ఒక్క ఓటు కూడా ఫలితంపై ప్రభావం చూపుతుందన్నది తెలిసిందే. దీంతో వలసవెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకొని ఓట్లు రాబట్టుకునేందుకు శివారు గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. వారికి గాలం వేసేందుకు ఎప్పుడు లేనిది కొత్తగా వారికి ఫోన్లు చేసి గ్రామాలకు వచ్చి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మీ ఓట్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి, వచ్చి ఓట్లు వేసి వెళ్ళండి అంటూ నిత్యం వారికి ఫోన్లు చేస్తూ చుట్టరికం కలుపుతూ తియ్యగా మాట్లాడుతూ బుట్టలో వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని మంచాలలో 23, యాచారంలో 24, ఇబ్రహీంపట్నంలో 14, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 18 చొప్పున గ్రామ పంచాయతీలున్నాయి. వీటిల్లో యాచారంలో నందివనపర్తి, కేసీ తండా, అబ్దుల్లాపూర్‌మెట్‌లో బలిజగూడ, మంచాలలో ఆంబోతు తండా గ్రామ పంచాయతీలు మొత్తం నాలుగు సర్పంచ్‌లు ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగతా గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు తమ గ్రామం నుండి వలస వెళ్లినవారి ఫోన్ నెంబర్లు సంపాదిస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 25న రెండవ విడతలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం కావడంతో చాలామంది ఒక్కరోజు ముందు చెబితే సెలవు పెట్టుకోరని భావించి వారం రోజుల ముందునుండే వారికి ఫోన్లు చేస్తున్నారు. ఎలాగైనా సెలవు పెట్టుకొని గ్రామాలకు రావాలని, వచ్చి ఓట్లు వేసి పోవాలని కోరుతున్నారు.
జోరుగా ఎన్నికల ప్రచారం
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రచారానికి ఊపుతెచ్చారు. మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. సర్పంచ్‌లకు ధీటుగా వార్డు సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పొల్కంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చెరుకూరి అండాలుగిరికి మద్దతుగా గ్రామస్థులంతా కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పొల్కంపల్లి అనుబంధ గ్రామాలయిన ఎన్గల్‌గూడ, జాజోనిబావి గ్రామాల్లో పెద్ద ఎత్తునర్యాలీగా ప్రచారాన్ని చేపట్టారు. దండుమైలారం, చర్లపటేల్‌గూడ, ఎలిమినేడు, కప్పాడు, తుర్కగూడ, నాగాన్‌పల్లి, రాయపోల్, ముకునూరు, తులేకలాన్ గ్రామాల్లోనూ ఎన్నికల ప్రచారం వేడెక్కింది.