రంగారెడ్డి

ఇది పల్లె భవితవ్యం..చిత్తశుద్ధితోనే ప్రగతి పథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 20: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అధివృద్ధి బాట పడుతుంది. పల్లెలు అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులే కాదు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలి. గ్రామ పాలన, నిధులు కేటాయింపు, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది తదితర అంశాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. పంచాయతీ అనగానే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గురించే అందరం చర్చించుకుంటాం. గ్రామ అభివృద్ధి కేవలం వారితోనే సాధ్యమవుతుందని అపోహ పడుతుంటాం. వాస్తవానికి పల్లెలు ప్రగతి పథంలో నడవాలంటే వారితో పాటు ఎన్నో రకాల ప్రభుత్వ శాఖల సమన్వయం, సిబ్బంది భాగస్వామ్యం అవసరం ఉంటుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పని చేసే వివిధ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పంచాయతీల కార్యనిర్వాహణ, అభివృద్ధి కోసం కేటాయించే పథకాలు, వివిధ రకాల నిధులు, స్వయం సమృద్ధి సాధించడానికి ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. గ్రామాల జనాభా ఆధారంగా ఆయా గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయి. సొంత వనరుల ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటు పంచాయతీలకు ఉంటుంది. గ్రామ స్థాయిలో వివిధ శాఖల సమన్వయంతో పని చేసే వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది. చాలా మంది సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులకు పాలన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల సమీకరణపై అవగాహన ఉండటంలేదు. దీంతో పంచాయతీల నిర్వహణ భారంగా మారి పల్లెలు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిపోతున్నాయి.
ఆస్తిపన్నులతో స్వయం అభివృద్ధి
ఏ పంచాయతీ అయినా వేగంగా అభివృద్ధి చెందాలంటే స్థానికంగా వనరులను సద్వినియోగం చేసుకోవడం సరైన మార్గం. వంద శాతం పన్నుల వసూళ్ల ద్వారా పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించగలుగుతాయి. ఇంటి పన్ను, అడ్వర్టయిజ్‌మెంట్, ఎంటర్‌టైన్ మెంట్, ఆస్తిపన్ను, భూముల క్రయ విక్రయాల ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజులు, నీటి పన్ను, బెటర్‌మెంట్ చార్జీలు, గృహ నిర్మాణ అనుమతులు, ఇతర పన్నులతో పంచాయతీ నిర్వహణ చేపడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రాంటుతో అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. ఇక పోతే ఎంపీ, రాజ్యసభ, ఎంఎల్‌సీ, జడ్‌పీ వంటి నిధులతో అభివృద్ధికి బాటలు వేయొచ్చు. తద్వారా ఆయా సామాజిక వర్గాల అభివృద్ధికి వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులు రాబట్టగలిగితే అభివృద్ధి సాధ్యమే. గ్రామాల్లో సామాజిక భవనాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, దోభీఘాట్లు, యువజన సంఘాల భవనాలు, వైకుంఠ ధామాలు వంటి అభివృద్ధి పనులు చేయించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.