రంగారెడ్డి

బాసరలో అంధుల ఆశ్రమం ఏర్పాటుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, జనవరి 20: అంధుల కోసం బాసరలో ఆశ్రమం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చించి కృషి చేస్తానని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని లింగోజిగూడ డివిజన్ తపోవన్‌కాలనీలోగల వికలాంగుల కల్యాణ వేదిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పోచారం మాట్లాడుతూ అంధులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అన్ని అవయవాలు ఉన్నా చేయని సేవలను సంస్థ చైర్మన్ సుభాష్ గుప్త చేయడం అభినందనీయమని అన్నారు. అంధులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తపోవన్‌కాలనీలో నిర్వహిస్తున్న వికలాంగుల కల్యాణ వేదిక సంస్థకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలోరాంబాబు, కాశివిశ్వనాథ్, గంగారాం, కరుణాకర్, రమేష్, వెంకటేష్, లక్ష్మీ, కృష్ణవేణి, అనిత పాల్గొన్నారు.

కండర క్షీణిత వ్యాధిపై అవగాహన
హయత్‌నగర్, జనవరి 20: ప్రతి ఒక్కరు కండర క్షీణిత వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని చంపాపేట్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని ఈస్ట్‌మారుతీనగర్ కమ్యునిటీహాల్‌లో తెలంగాణ మస్కులర్ డిస్ట్ఫ్రో అసోసియేసన్ ఆధ్వర్యంలో బెంగుళూరుకు చెందిన ఓఆర్‌డీఏ స్వచ్ఛంద సంస్థ డీఎండీ వారికి డీఎన్‌ఏ పరీక్ష ఏ టైప్ అని తెలుసుకునేందుకు రక్తపరీక్ష వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యశిబిరాన్ని కార్పొరేటర్ రమణా రెడ్డి ప్రారంభించారు. కండర క్షీణిత వ్యాధితో కదలలేని స్థితిలో ఉండికూడా అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకొని వైద్యశిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని కార్పొరేటర్ రమణారెడ్డి తెలిపారు. దివ్యాంగులకు ప్రభుత్వం కొత్తగా రూ. 3016 పెన్షన్ అందిస్తుందని అన్నారు. కండర క్షీణిత వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. డాక్టర్లు ప్రసన్న, ప్రవీణ్, ఉస్మాన్, అసోసియేషన్ సభ్యులు వెంకట్ రెడ్డి, కత్తులబాబు, రవి కుమార్, వినోద్ కుమార్, శివ కుమార్, శ్రీనివాస్, శే్వత అగర్వాల్ పాల్గొన్నారు.