రంగారెడ్డి

‘పంచాయతీ’ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 20: తొలి విడత పంచాయతీ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగనుండటంతో ఎన్నికల నిర్వహణలో అధికారులు తలమునకలయ్యారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్‌నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా మండల కేంద్రాల నుంచి గ్రామాలకు బ్యాలెటు బాక్స్‌లతో పాటు సామగ్రిని తరలించారు. ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఫరూక్‌నగర్ (షాద్‌నగర్) మండలంలో 47గ్రామ పంచాయతీలు, 440వార్డులకు ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. అధికారులు వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 440 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేశంపేట మండలంలో 25గ్రామ పంచాయతీలకు 260 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొందుర్గు మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు 178 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చౌదరిగూడలో 22గ్రామ పంచాయతీలకు 188 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తూరు మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలకు, నందిగామ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ జరిగిన రోజు మధ్యాహ్నమే ఫలితాలు వెలువడనుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. షాద్‌నగర్ సబ్ డివిజనల్ అధికారి పర్యవేక్షణలో పోలింగ్ సజావుగా సాగేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.