రంగారెడ్డి

పోటా పోటీగా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, జనవరి 21: మండలంలోని 26గ్రామ పంచాయితీలలో ఎన్నికల ప్రచార హోరు వాడివేడిగా కొనసాగుతుంది. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్‌లతోపాటు వార్డు సభ్యులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తు ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. ఆయా గ్రామాలలోని మహిళలకు కేటాయించిన స్థానాలలో సతులకోసం పతులు ప్రచార హోరును ఉధృత్వం చేసారు. జనరల్‌కు కేటాయించిన చంద్రధన, చెన్నారం, చౌదర్‌పల్లి, ఖానాపూర్, రాంపూర్, జనరల్ మహిలలకు గౌరిపల్లి, గట్టు ఇప్పలపల్లి, జంగారెడ్డిపల్లి, జూలపల్లి, మెదక్‌పల్లి, వీరన్నపల్లి గ్రామాలలో ప్రచార హోరు ఒకరికి మించి ఒకరు దూకుడుగా ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి మద్యంతో, డబ్బులు ఎరచూపి తమవైపు తిపుకుంటున్నారు. ఈగ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సర్పంచ్, వార్డు సభ్యులు తమ గెలుపుకోసం అనుచరగణంతో డప్పు మేళాలతో నృత్యాలు చేస్తు, బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుతూ తమ గుర్తులను చేతబూని ఓట్లు వేయాలని కుంకుమ దిద్ది, చివరకు కాళ్లు మొక్కుతు, గడ్డం పట్టుకుంటూ పడరాని పాట్లు పడుతున్నారు.
కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు :ఆచారి
ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి అన్నారు. సోమవారం కడ్తాల సర్పంచ్ అభ్యర్థి రమేశ్ అయ్యగారుకి మద్దతుగా ఆచారి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా గాంధీచౌక్ వద్ద మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేసి గద్దె నెక్కాడని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా పంచాయతీ ఎన్నికల నాటికి ఇంటింటికీ తాగునీటిని అందిస్తానని చెప్పి కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికి తాగునీరు అందివ్వలేదని అన్నారు. మిషన్ భగీరథ పథకం కమీషన్ భగీరథగా మారిందని కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేస్తుండటంతో ఎక్కడపడితే అక్కడ ట్రయల్‌లోనే పైపులు పగిలి నీరు వృధాగా పోతుందని అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాండూరు వద్ద నిన్న పైప్ లైన్ పగిలి నీరు పోయిందని గుర్తుచేశారు.
అభ్యర్థులు ఖర్చు వివరాలను తెలపాలి
ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో సర్పంచ్ వార్డు మెంబర్‌లకు పోటీ చేసే అభ్యర్థులు ప్రతిరోజుకు సంబంధించి ఖర్చు వివరాలను తెలియజేయాలని ఎంపీడీఓ వెంకట్రాములు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు నడుచుకోవాలని సర్పంచ్ అభ్యర్థులు రూ.లక్షాయాభై వేలు, వార్డు సభ్యులు రూ. 30 వేలు ఖర్చు చేయాలని అంతకుమించి ఖర్చు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోజువారి ఖర్చు వివరాలను ఆమనగల్లు మండలానికి సంబంధించి తాహసీల్దారు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులుకు, కడ్తాల మండల అభ్యర్థులు కడ్తాల్ తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లకు వివరాలను అందజేయాలని తెలిపారు.
నేడు అభ్యర్థులకు అవగాహన సమావేశం
ఆమనగల్లు, కడ్తాల మండలంలో సర్పంచ్, వార్డు మెంబర్‌లకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈనెల 22 మంగళవారం ఆమనగల్లు మండల పరిషత్ సమావేశ హాలులో మధ్యాహ్నం 3 గం.కు అవగాహన సమావేశం నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ వెంకట్రాములు తెలిపారు. ఈ సమావేశానికి పోటీ చేసే అభ్యర్థులందరూ హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధులను గెలిపించండి
మర్పల్లి: ఈనెల జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను గెలిపించి తద్వారా గ్రామాల అభివృద్ధి సాధిద్దామని చేవెళ్ల ఎం.పీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మర్పల్లి హనుమాన్ ఆలయం వద్ద జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండవసారి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అందువల్ల కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్‌లను గెలిపించుకుందామని అన్నారు. వచ్చే ఎం.పీ ఎన్నికల్లో విశే్వశ్వర్‌రెడ్డి పోటీలో వుంటారని ఆయన ఆధ్వర్యంలో మనం గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, కలీముద్దీన్, నాగేష్, నర్సింలు పాల్గొన్నారు.