రంగారెడ్డి

ఎన్నికల నియమావళి బేఖాతర్.. డబ్బుల పంపిణీపై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 21: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి ప్రతాపసింగారం గ్రామంలో కుల సంఘాలకు డబ్బులు పంపిణీ చేస్తున్నాడని ఆరోపిస్తు ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సర్పంచ్ బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు బైటాయించి ధర్నా జరిపారు. సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందరం టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికి ఒక్క అభ్యర్థికి మద్దతుగా కుల సంఘాలను ఇంట్లోకి పిలిపించి డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపించారు. తమ సమీప బంధు, మిత్రులను సైతం డబ్బులకు లొంగదీసుకునే యత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. సుధీర్ రెడ్డి మాటలను ఖాతరు చేయని వారిని బెదిరింపులకు పాల్పడుతు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బుల పంపిణీ ఎన్నికల అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతాపసింగారం సర్పంచ్ అభ్యర్థులు వంగూరి జంగయ్య, గ్యార కుమార్, వంగూరి శివకుమార్, కంబాలపల్లి లోకేష్, వార్డు అభ్యర్థులు బాషగళ్ల విజయకుమార్ గౌడ్, డేరంగుల బాలరాజు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కేపీహెచ్‌బీకాలనీ, జనవరి 21: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్‌ను సోమవారం ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి ఇద్దరికి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న వారికి అపన్న హస్తంలా ఆదుకుంటుందని అన్నారు. దీప్తీ శ్రీనగర్‌కు చెందిన వసంత లక్ష్మీకి రూ.60 వేలు, హెచ్‌ఎంటీహిల్స్‌కు చెందిన నాగమణికి రూ.60 వేలు చెక్కుల రూపంలో అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సైదేశ్వర్ రావు, కాశీనాథ్ యాదవ్ పాల్గొన్నారు.