రంగారెడ్డి

నేడు, రేపు నీటి సరఫరాలో అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 21: వికారాబాద్ పట్టణంలో మంగళ, బుధవారాల్లో నీటి సరఫరా ఉండదని మున్సిపల్ కమిషనర్ బీ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా చేయబడుతున్న మూడు మీటర్ల డయా పైప్‌లైన్ మహబూబ్‌నగర్ జిల్లా గుడుపల్లి గుట్టవద్ద లీకేజీ, మరమ్మతు పనులు జరుగుతున్నందున, రెండు రోజులు నీటి సరఫరా చేయబడదని చెప్పారు. పట్టణ ప్రజలు మున్సిపల్ నీటి సరఫరా సిబ్బందితో సహకరించాలని కోరారు.

28న ఐటీఐలో ‘జాబ్‌మేళా’
మేడ్చల్, జనవరి 21: మేడ్చల్ పారిశ్రామిక శక్షణా సంస్థ (ఐటీఐ)లో ఈ నెల 28న ‘జాబ్‌మేళా’ ఏర్పాటు చేసినట్లు డీ.ప్రిన్సిపాల్ శైలజ సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీలైన గాయత్రీ కన్స్‌స్ట్రక్షన్స్‌తో పాటు బహుళజాతి (ఎంఎన్‌సీ) కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటాయని ఐటిఐ ఉత్తీర్ణులై 18 సంవత్సరాల వయస్సు నిండిన అన్ని ట్రేడ్‌ల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. అదేవిధంగా ఎన్‌ఈఈఎం ప్రోగ్రాం కింద రాణే ఇంజన్ వాల్వేస్, విద్యుత్ కంట్రోల్ కంపెనీలు నిర్వహించే జాబ్‌మేళాలో పదవతరగతి పాసై 18 సంవత్సరాలు నిండిన వారు కూడా పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే ‘జాబ్‌మేళా’ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు పాల్గొని సద్వినియోగం చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ శైలజ పేర్కొన్నారు.

వాసవిక్లబ్ సేవలు అభనందనీయం
వనస్థలిపురం, జనవరి 21: వాసవిక్లబ్ సేవలు ఎంతో అభినందనీయమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వర్‌రావు చెప్పారు. వనస్థలిపురం వాసవిక్లబ్, వనితా క్లబ్ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆటోనగర్‌లోని కర్నాటి గార్డెన్‌లో నిర్వహించారు. ఈకార్యక్రమానికి గంప నాగేశ్వర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ సమజం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని చెప్పారు. వాసవిక్లబ్ చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని తమ వంతు సహాయంగా సమాజ సేవకు పాటుపడాలని తెలిపారు.ఈ సందర్భంగా వాసవిక్లబ్, సహకారంతో వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు దొంతు పాండురంగయ్య, మల్లిఖార్జున్, దూరయ్య, రంగ మోహన్‌రావు, నర్సింహులు, మల్లేశ్వరీ, లక్ష్మీ, స్వరూపరాణి, చింతల రవికుమార్, చంద్రవౌళీ గుప్తా, జగదీశ్వర్, వెంకటేశ్వర్, రమేష్ పాల్గొన్నారు.