రంగారెడ్డి

గుడిలోకి అనుమతించాలని కమిషనర్‌కు వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జనవరి 22: మియాపూర్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న అమ్మవారి గుడిలోకి అనుమతించాలని కోరుతూ సైబరాబాద్ కమిషనర్‌కు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కార్పొరేటర్, విశే్వశ్వరయ్య కాలనీవాసులు కలిసి సమస్యను వివరించారు. పోలీస్ స్టేషన్‌కు కేటాయించిన స్థలంలో అమ్మవారి దేవాలయం ఉన్నందున పూజలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సీపీ సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ నవతరెడ్డి తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు బొబ్బ కరుణాకర్ రెడ్డి, పోచయ్య, అనంతరెడ్డి, రాజశేఖర్, సౌజన్య, కాలనీవాసులు ఉన్నారు.
సర్వే చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్న గ్రామస్థులు
మేడ్చల్, జనవరి 22: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండలంలోని గౌడవెల్లి గ్రామంలో సర్వే చేస్తున్న విద్యార్థులను గ్రామస్థులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామంలో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులపై మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు సర్వే చేపట్టారు. సర్వే చేస్తున్న విద్యార్థులు గ్రామంలోని వృద్ధురాలితో మీరు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే మీ పింఛన్ కట్ అవుతుందని తెలపడంతో ఆందోళన చెందిన వృద్ధురాలు అక్కడే ఉన్న మహిళలకు విషయాన్ని తెలిపింది. దీంతో సమాచారం అందుకున్న పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు వెంటనే అక్కడకు చేరుకుని సర్వే చేస్తున్న విద్యార్థులను నిలదీశారు. సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యార్థులను అడ్డుకున్నారు.

గ్రామాల్లో అధికారుల తనిఖీలు
యాచారం, జనవరి 22: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల అధికారులు గ్రామాల్లో నిఘా పెంచారు. యాచారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రిసైడింగ్ అధికారులు, ఫ్లైయింగ్ స్వ్కాడ్‌లు తనిఖీలు చేపట్టారు. నగదు తరలింపు, పంపిణీ పై నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహించి, అధికమొత్తంలో నగదు తరలిస్తున్న వారి సంబంధిత పత్రాలను తనిఖీ చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పొల్కంపల్లి, నాగాన్‌పల్లి గ్రామాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాహనాలల్లో పట్టుబడిన నగదుకు రశీదులను పరిశీలించి, అవి సక్రమంగా ఉండడంతో నగదును అందజేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు పెద్ద మొత్తంలో నగదు తరలింపునకు సంభందించిన రశీదులను తప్పకుండా వెంటపెట్టుకోవాలని సూచించారు.

ప్రతిభను కనబరిచిన దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
జీడిమెట్ల, జనవరి 22: జేఎఫ్‌కే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ సత్తాను చాటారు. అండర్-10 బాలురు మొదటి స్థానంలో నిలిచారు. వీరు ఫిబ్రవరి 7న తేదీన నేషనల్ ఆడడానికి బెంగులూరు వెళ్లనున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. అండర్-12 బాలురు, బాలికలు రెండవ స్థానంలో నిలిచారు. అండర్-14 బాలికలు రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

మల్కాజిగిరి అభివృద్ధికి సహకరించాలి
అల్వాల్, జనవరి 22: మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి అధికారు లు సహకరించాలనీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కోరారు. బుధవా రం అల్వాల్ సర్కిల్ పరిధిలోని అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై సమీక్షించి కాలనీలు, బస్తీలవారిగా సమస్యలు అడిగి తెల్సుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే స్పం దించి ప్రజలకు జవాబుదారిగా ఉండాలనీ చెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ జోనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమీషనర్ తిప్పర్తి యాద య్య, యస్‌సీ శరత్ బాబు, ఆర్‌డీఒ మధుసూదన్, డాక్టర్ గోవర్థన్, జలమండలి అధికారులు శ్రీ్ధర్‌రెడ్డి, రజని, మహేష్, అనిల్‌రాజ్, మాధవి, లక్ష్మీరావుతోపాటు కార్పొరేటర్లు రాజ్‌జితేంద్రనాథ్, సబితా అనిల్‌కిషోర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి
ఒవికారాబాద్, జనవరి 22: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని వికారాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ ఆనం ద్ స్పష్టం చేశారు. మంగళవారం రవీంద్ర మండపంలో ఎంపీపీ ఎస్.్భగ్యలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ చాలా గ్రామాల్లో పట్టా పాసుపుస్తకాలు అందడం లేదనే ఫిర్యాదులున్నాయని అన్నారు. వికారాబాద్ మంజూరై వేరో చోట కొనసాగుతున్న పాఠశాల, కళాశాలలు వికారాబాద్ మండలానికి తరలించేందుకు అధికారులు సహకరించాలని వాటికి అవసరమైన స్థలం, భవనాలను సమకూర్చాలని పేర్కొన్నారు.