రంగారెడ్డి

రెండు దఫాలు ఈవీఎంల ట్యాంపరింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, జనవరి 22: 2014, 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుందని మలక్‌పేట్ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ ఇబ్రహింపట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధికారులను బెదిరించి పత్రాన్ని పొందాడని ఆరోపించారు. మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. సమావేశంలో శేఖర్‌గౌడ్, మర్రి నీరంజన్‌రెడ్డి, కొత్తకుర్మ శివకుమార్, అంతటి ఊషయ్య, కొత్త ప్రభాకర్, విజయశేఖర్‌రెడ్డి, చంద్రంగౌడ్ పాల్గొన్నారు.

సర్కార్ బడి పిల్లలు ఎస్‌పీసీలుగా ఎంపిక
శేరిలింగంపల్లి, జనవరి 22: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశానుసారం చందానగర్ పోలీసులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులను స్టూడెంట్ పోలీస్ క్యాడెట్‌కు ప్రాజెక్ట్‌కు ఎంపిక చేశారు. మంగళవారం చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఇన్‌స్పెక్టర్ బీ.రవీందర్, ఎస్‌ఐ శంకర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు 176 మంది విద్యార్థులు హాజరుకాగా 44 మందిని అర్హత సాధించారు. విద్యార్థులకు 100 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకు లాంగ్‌జంప్ పోటీలు జరిపిన అనంతరం రాత పరీక్ష కూడా పెట్టారు. ఇందులో 22 మంది విద్యార్థులు, 22 మంది విద్యార్థినులను ఎంపిక చేశామని ఇన్స్‌పెక్టర్ రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు ఎల్.శంకర్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.