రంగారెడ్డి

నేతాజీ ఆశయ సాధనకు పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జనవరి 23: యువత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహాం వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నేతాజీ అజాద్ హింద్‌ఫౌజ్‌ను స్థాపించి ఆంగ్లేయులను వణికించారని గుర్తుచేశారు. ఆయనలోని దేశభక్తిని ధైర్యసాహసాలను కొనియడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శైలజ హరినాథ్, టీఆర్‌ఎస్ నాయకులు మల్లికార్జున్, విష్ణుచారి, యువజన సంఘాల సభ్యులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రైతులు పొదుపు అలవాటు చేసుకోవాలి
మేడ్చల్, జనవరి 23: రైతులు పొదుపును అలవాటు చేసుకుని ఆర్థికంగా బలపడాలని మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ మెట్టు అంతిరెడ్డి కోరారు. పట్టణంలోని హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో బుధవారం ఆర్థిక అక్షరాస్యత, ఐశ్వర్యానికి బాట అనే అంశంపై నాబార్డ్ నిర్వహించిన సమావేశంలో అంతిరెడ్డి మాట్లాడుతూ రైతులు పొదుపును అలవర్చుకోవాలని తమ ఖాతాల ద్వారా సేవింగ్స్ చేయాలని ఖాతా వల్ల రూపే కార్డులు, బీమా వంటి సౌకర్యాలు చేకూరుతాయని వివరించారు.
సహకార బ్యాంకులలో రైతులు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరిచే వీలుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి శ్రీహరి, మేనేజర్ అయేషా, బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు రాధిక, కస్తూరి, సత్య పాల్గొన్నారు.