రంగారెడ్డి

పాఠశాలలో చొరబడిన పాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, జనవరి 23: పాఠశాలలోకి పాము చొరబడటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం కడియాలకుంట గ్రామ పంచాయతీ శివారులో ఉన్న బురుతండా ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పాఠశాలకు విద్యార్థులు వచ్చిన సమయంలోనే ఆవరణలో పాము దర్శనమివ్వడంతో భయంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. దాంతో ఆ పాము పాఠశాల గదిలోకి వెళ్లిపోయింది. ఏమి చేయాలో తెలియక విద్యార్థులు భయకంపితులై ఎవరికి వారే పరుగులు తీశారు. ఇదే విషయాన్ని గ్రామస్థులకు విద్యార్థులు సమాచారం అందించగా పాఠశాల వద్దకు చేరుకొని పామును చంపివేశారు.
ప్రభుత్వ పాఠశాలలో పాము కలకలం
జీడిమెట్ల, జనవరి 23: గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని దూలపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. బుధవారం పాఠశాలలోని వంటశాల సమీపంలో భారీ నాగుపాము సంచరించడం విద్యార్థులు గమనించారు. భయాందోళనకు గురైన విద్యార్థులు వంట చేసే సిబ్బందికి, ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేశారు. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వలంటరీ ఆకాంక్షకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఆకాంక్ష వెంటనే పాఠశాలకు చేరుకుని నాగుపామును ఓ ప్లాస్టిక్ డబ్బాలో బందించి వెంట తీసుకువెళ్లారు. దీంతో విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.