రంగారెడ్డి

ఈసారైనా కొలిక్కి వచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 14: కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి మండలాల సరిహద్దుల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. కొనే్నళ్లుగా రెవెన్యూ అధికారులు సరిహద్దులను తేల్చలేకపోతున్నారు. కూకట్‌పల్లి మండల పరిధిలో ప్రైవేట్ స్థలముందని కొందరు వ్యక్తులు ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని జగద్గిరిగుట్ట సర్వే 348/1లోని ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుందని కుత్బుల్లాపూర్ తహశీల్దార్‌కు కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. మండల తహశీల్దార్ గౌతమ్‌కుమార్.. ప్రభుత్వ స్థలమా? ప్రైవేట్ స్థలమా? తేల్చేందుకు ఇరు మండలాల రెవెన్యూ సర్వేయర్‌లతో సర్వే నిర్వహించారు. గురువారం కుత్బుల్లాపూర్ మండల సర్వేయర్ సునీత, కూకట్‌పల్లి సర్వేయర్ ప్రసన్న సర్వే చేశారు. కుత్బుల్లాపూర్ మండల సర్వే నంబర్ ఓవర్ ల్యాప్ అయినట్లు గుర్తించిన సర్వేయర్ నివేదికను తహశీల్దార్‌కు సమర్పిస్తామని తెలియజేశారు. గతంలో బాలానగర్ మండలం ఉన్న సమయంలోనే పలు మార్లు ఈ రెండు మండలాల మధ్య సరిహద్దులను తేల్చేందుకు పలుమార్లు సర్వేలు చేశారు. కానీ రెవెన్యూ అధికారులు తేల్చలేకపోయారు. సర్వే 348/1 సర్వేలోని ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నాయని లోక్‌అదాలత్‌ను ఓ వ్యక్తి ఆశ్రయించాడు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు యత్నిస్తున్నారు. ఈ సర్వేలతో సరిహద్దుల పంచాయతీ తేలేనా వేచిచూడాలి.

సాయిబాబా దేవాలయ వార్షికోత్సవం
కొత్తూరు రూరల్, ఫిబ్రవరి 14: భక్తిశ్రద్ధలతో శ్రీసాయిబాబా దేవాలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం నందిగామ మండలం చేగూరు శ్రీసాయిబాబా దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా శ్రీసాయిబాబాకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేగూరు సింగిల్ విండో చైర్మన్ మామిళ్ల విఠల్, సర్పంచ్ మామిళ్ల సంతోష ఆధ్వర్యంలో శ్రీసాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాండయ్య పాల్గొన్నారు.
దాతల సహకారంతో
ఆలయ నిర్మాణానికి శ్రీకారం
కేశంపేట, ఫిబ్రవరి 14: దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. పోమాలపల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించేందుకు గ్రామస్థులు ముందుకు వచ్చారు. మండల పరిధిలోని పోమాలపల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మూడు సంవత్సరాల క్రితం పునాదులు తీసి వదిలేసారు. గ్రామస్థులు అంతా కలిసి సర్పంచ్ నిధురం కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, గ్రామస్థులు చాకలి జంగయ్య, రమేష్, రాజు, రవి, భీమోజీ, నర్సింలు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.