రంగారెడ్డి

విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉన్నత స్థాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, ఫిబ్రవరి 15: పిల్లల అభిరుచులు తెలుసుకొని వారిలోప్రతిభ గుర్తించి ప్రొత్సహిస్తే ఉన్నత స్థానాలకు వెళ్తారని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. శామీర్‌పేట్ మండం జవహర్‌నగర్‌లోని సీఆర్‌పీఎఫ్ పబ్లిక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జ్యోతిధస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సీఆర్‌పీఎఫ్ డీఐజీ రఘురాం, సీఆర్‌పీఎఫ్ పోలీస్ అధికారి సాహు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేశారు. సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సీబీఎస్‌సీ సిలబస్ కష్టతరమని పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్ పాఠశాలలో చదువుతున్నా విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నరని, వారు 94శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతూ ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులు వివిధ నేపథ్యం నుంచి వచ్చారని కృషి, పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలు గొప్పవని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఆనురాధ, కీసర తహశీల్దార్ నాగరాజు పాల్గొన్నారు.
లింగమయ్య ఆలయ స్థలం కబ్జా ఆపాలి
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15: పురాతన లింగమయ్య ఆలయ స్థలంలో అక్రమ నిర్మాణాలు ఆపాలని శేరిలింగంపల్లి సర్కిల్ 20 ఉప కమిషనర్‌కు దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం డిప్యూటీ కమిషనర్ టీ.వెంకన్నను కలిసి స్థలం కబ్జా, తప్పుడు పన్ను రశీదులు, అక్రమ రిజిస్ట్రేషన్ గురించి వివరించారు. తారానగర్‌లో మొట్టమొదటి ఆలయంగా పేరుగాంచిన వందల ఏళ్ళనాటి శివుడి దేవాలయం స్థలాన్ని కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతూ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. వెంటనే అక్రమ కట్టడాన్ని నిలిపివేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని తారానగర్ గ్రామస్థులు కోరారు.
17 నుంచి మాణిక్య ప్రభువు జయంతి ఉత్సవాలు
పరిగి, ఫిబ్రవరి 15: మండల పరిధిలోని మిట్టకోడూర్ గ్రామంలో ఈ నెల 17వ తేది నుంచి 20వ తేది వరకు మాణిక్య ప్రభువు జయంతి ఉత్సవాలు ఘ నంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 17 తేది సాయంత్రం 7.3 5 నిమిషాలకు మాణిక్య ప్రభువు పతాక ఊరేగింపు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. సోమవారం ఉదయం అంజనేయ స్వామి పూజ, యజ్ఞం, మంగళవారం 4.14 నిమిషాలకు ప్రభువు పల్లకి సేవ గంగస్నానం, బుధవారం రోజు కార్యక్రమం ముగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఎల్‌ఈడీ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్సీ
ఆమనగల్లు, ఫిబ్రవరి 15: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి, సాకిబండ తాండలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లను శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.ఆచారి, జడ్పీటీసీ కండె హరిప్రసాద్‌తో కలిసి ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రారంభించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సబ్‌కాసాత్ సభ్‌కా వికాస్ పేరుతో ముందుకు సాగుతోందని గడిచిన నాలుగున్నరేళ్ల్ల కాలంలో అవినీతి ఆరోపణలు లేకుండా సుస్థిరమైన పాలన అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నిట్ట నారాయణ, ఎంపీటీసీ పత్యా నాయక్ సుండూరి శేఖర్‌జాన్సి, సోని జయరాం, గోరటి నర్సింహ, మేడిశెట్టి శ్రీధర్, కండె సాయి, మల్లేశ్ యాదవ్ పాల్గొన్నారు.
ఉగ్రవాదం దేశాభ్యున్నతికి గొడ్డలిపెట్టు
తాండూరు, ఫిబ్రవరి 15: ఉగ్రవాదం దేశాభ్యున్నతికి గొడ్డలి పెట్టులా మారుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌక్ నుంచి స్థానిక అంబేద్కర్ చౌరాస్తా వరకు కొవ్వొత్తులతో పీస్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరాస్తాలో మాట్లాడుతూ దేశ భద్రత, సమగ్రతల కోసం నిర్విరామంగా పాటు పడుతున్న వీర జవాన్‌లు, సీఆర్‌పీఎఫ్ వాహనంపై దాడిచేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ర్యాలీ, సంతాప సభలో ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, యంగ్ లీడర్స్ పాల్గొని జవాన్‌లకు అశ్రు నివాళులు అర్పించారు.
దళితులను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 15: దళితులను వేధింపులకు గురిచేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎంఆర్‌పీఎస్) కోరింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ మాట్లాడారు. బల్కంపేటకు చెందిన వనం శ్రీనివాస్ ఆస్తిపై కనె్నసిన కొందరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు తప్పుడు కేసులు బనాయించేందుకు యత్నించారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ తమ ఇంటిని విక్రయించిన సదరు వ్యక్తులే.. వనం శ్రీనివాస్ ఫోర్జరీ సంతకాలతో తమ ఇంటిని లాక్కొన్నారని పోలీసులను ఆశ్రయించారని చెప్పారు. దళితుడైన శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసి, కులం పేరుతో దూషించిన సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకొని దళిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బాధితుడు శ్రీనివాస్, మధుసూదన్, రాంబాబు, గోపి, రాజేశ్వర్ పాల్గొన్నారు.

అక్రమంగా టొబాకో తరలిస్తున్న ముఠా అరెస్టు
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 15: అక్రమంగా టొబాకో తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ హసన్‌నగర్‌లోని మహ్మదీయ మజిద్ సమీపంలో మహ్మద్ అబ్దుల్ రజాక్(39) అక్రమంగా తన నివాసంలో టొబాకోను విక్రయిస్తున్నాడు. విశ్వసనీయంగా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు.. రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.10.08 లక్షలు విలువ చేసే టొబాకో లభ్యమైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భూ కబ్జాదారులను కట్టడి చేయాలి
* కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15: భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడి ప్రజావసరాలకు కేటాయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కోరారు. శుక్రవారం కలెక్టర్ డీఎస్ లోకేష్ కుమార్‌ను కలిసి ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సంక్షేమ పథకాల అమలు గురించి ఎమ్మెల్యే వివరించారు. శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లి సర్వే 74లోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని, డబుల్ బెడ్‌రూం, కళాశాల, అంగన్‌వాడీ పాఠశాలకు స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే అడిగారు. జాయింట్ కలెక్టర్ ఎస్.హరీష్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళతో ఎమ్మెల్యే సమావేశమై ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రజల సంక్షేమం కోసం స్థలాల కేటాయింపుపై చర్చించారు.
తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
బాలానగర్, ఫిబ్రవరి 15: ప్రజలకు తాగునీరు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్య అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని పూల్‌బాగ్ కాలనీలో తాగునీటి పైపులైన్ నిర్మాణం కోసం జలమండలి అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం వేసిన పైపులైన్ రైల్వే ట్రాక్ నిర్మాణం కారణంగా ధ్వంసమైందని అన్నారు. ప్రజల దాహార్తీని తీర్చేందుకు నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణారావు సహకారంతో డివిజన్‌లో వౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జలమండలి డీజీ ఎం.రాజేష్, ఏఈ త్రినాథ్ రావు పాల్గొన్నారు.
348 సర్వేలోని నిర్మాణాలు తొలగించాలి
కీసర, ఫిబ్రవరి 15: సర్వే 348/1లో వెలసిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని వడ్డెర సంఘం నాయకులు డిమాండ్ చేసారు. శుక్రవారం కుత్భుల్లాపూర్ మండలం, జగద్గిరిగుట్టకు చెందిన వడ్డెరలు.. మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసారు. సర్వే నంబర్ 348/1 లో ప్రభుత్వం తమకు కొంత భూమిని గతంలో వడ్డెర సంఘానికి కేటాయించిందని అన్నారు. బాలకృష్ణ అనే వ్యక్తి ఇంజక్షన్ ఆర్డర్ పేరుతో అట్టి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, అడ్డుకో బోయిన తహశీల్దార్ గౌతమ్ కుమార్‌ను బెదిరించినట్లుగా వివరించారు. ప్రజలకు పట్టా భూమిగా చూపించి, ప్లాట్లు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అధికారుల స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. సీపీఐ నాయకులతో కలిసి కలెక్టర్ ఎంవీ రెడ్డికి వినతి పత్రం అందజేసారు. సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజక వర్గకార్యదర్శి ఉమా మహేశ్, వడ్డెర సంఘం మహంకాళి, హనుమయ్య, దుర్గయ్య పాల్గొన్నారు.
వౌలిక వసతులు మెరుగుపరుస్తాం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15: వౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాష్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాన్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మిర్యాల ప్రకాష్, ఆశ, మల్లిఖార్జున్, నాగేశ్వరరావు, సుధాకర్, కృష్ణమూర్తి, ఎం.ప్రసాద్, పోచయ్య పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం తనిఖీ
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 15: అత్తాపూర్ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య వడ్డించారు. కార్పొరేటర్ విజయ మాట్లాడుతూ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులకు అందాల్సిన వౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యురాలు రమాదేవి పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
* ఎమ్మెల్యే సబితా రెడ్డి వెల్లడి
బాలాపూర్, ఫిబ్రవరి 15: మున్సిపాలిటీలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంపై పాలకమండలి, అధికారులు దృష్టి సారించాలని మహేశ్వరం ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రా రెడ్డి సూచించారు. శుక్రవారం చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన జరిగిన బడంగ్‌పేట్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి సబితా ఇంద్రా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వేసవి సమీపిస్తునందున్న మున్సిపాలిటీ పాలకవర్గం సభ్యులు, మున్సిపాలిటీ అధికారులు, మెట్రో వాటర్‌వర్క్స్, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అధికారుల సమన్వయంతో మున్సిపాలిటీలో మంచి నీటి ఎద్దటి రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంచి నీరు, విద్యుత్ సమస్యలపై స్థానిక కౌన్సిలర్లు ఇచ్చే ఫిర్యాదులపై కమిషనర్ తక్షణమే స్పదించాలని ఆదేశించారు. వీధి లైట్లు లేనిదగ్గర కాంట్రాక్టర్ త్వరగా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు రిపేరింగ్ వచ్చిన వాటిని వెంటనే మార్చాలని సూచించారు. రోడ్ల దుస్థితి అతిదారుణంగా ఉన్న దగ్గర ముందుగా ప్యాచ్‌లు వేయాలని సూచించారు. కౌన్సిలర్ గుర్రం సాయి కిరణ్ రెడ్డి కోరిక మేరకు శానిటేషన్ సిబ్బంది కొరతను అధిగమించడాని త్వరలో కౌన్సిల్‌లో తీర్మానం చేసి, కొంతమందిని తీసుకుందామని సూచించారు. బకాయిలు చెల్లించలేదని.. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ కనెక్షన్లను ఎలా తొలగిస్తారని విద్యుత్ అధికారులపై సబితా రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల వౌలిక వసతుల కోసం కౌన్సిల్‌లో తీర్మానం చేసి, తగిన నిధులు కేటాయించాలని కమిషనర్ జీ.శ్రీనివాస్ రెడ్డిని సబితా రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రతి మున్సిపాలిటీకి రూ.10 కోట్లు అదనంగా ఇచ్చారని, బడంగ్‌పేట్, మీర్‌పేట్, జిల్లెలగూడ, జల్‌పల్లి మున్సిపాలిటీకు మాత్రమే రాలేదని అన్నారు.
ఎకగ్రీవంగా అజెండా తీర్మానం
మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో నూట పదకొండు (111) అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ సమావేశంలో ఎకగ్రీవంగా అమోదించినట్లు చైర్మన్ యాతం శ్రీశైలం యాదవ్ తెలిపారు. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసుకొని, అత్యవసర సమస్యలపై చర్చించి, తగిన తీర్మానాలు రూపొందించుకుందామని యాతం పేర్కొన్నారు. వైస్ చైర్మన్ చిగురింత నర్సింహారెడ్డి, మాజీ చైర్మన్, కౌన్సిలర్ సామ నర్సింహ గౌడ్, కౌన్సిలర్లు మమత సుదర్శన్ రెడ్డి, భీమిడి స్వప్న జంగా రెడ్డి, గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి, మంజుల కుమార్ గౌడ్, గౌర శారద సత్యనారాయణ, సమ్ రెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, ధశరథ నాయక్, గుర్రం సాయి కిరణ్ రెడ్డి, రామిడి కవిత రాం రెడ్డి, ఈరంకి వేణుకుమార్ గౌడ్, రాణమ్మ, రాళ్లగుడెం సంతోష శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జ్ఞానేశ్వర్, ఏఈలు బిక్కు నాయక్, దుర్గా ప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

కులకచర్ల: దేశాన్ని ఉగ్రభూతం వీడిపోతేనే అగ్రరాజ్యంగా మారేందుకు అవకాశాలుంటాయని భాజపా జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అమరులైన వీరజవాన్ల ఛాయచిత్రాలను ప్రధాన చౌరస్తాలో పెట్టి నివాళులు అర్పించారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసి విధులు నిర్వర్తిస్తుంటే పక్కలో బళ్లెంలా మారిన పాకిస్తాన్ తాట తీయాలంటే మరోసారి మోదీ సర్కార్ రావల్సిందేనని నొక్కి వక్కాణించారు.
కేపీహెచ్‌బీకాలనీ: జమ్మూ కాశ్మీర్‌లో సి ఆర్ పి ఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రవాది దాడి పిరికిపంద చర్య అని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్య హరిష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీకాలనీ టెంపుల్ బస్టాప్‌లో ఉగ్రవాదం నశించాలని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
* హోం మంత్రి మాహమూద్ అలీ
కుషాయిగూడ, ఫిబ్రవరి 15: మానసిక, శారీరక ఉల్లాసనికి క్రీడలు దోహద పడుతాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో జైలు అధికారులు ఏర్పాటు చేసిన క్రీడల పోటీలకు ముఖ్యఅతిథులుగా హోంమంత్రి, జైళ్ల శాఖల డీజీ వీకేసింగ్, డీఐజీ నర్సింహ పాల్గొని జైలు వార్డెన్లతో క్రీడా పోటీలను ప్రారంభించారు. జైలు సూపరింటెండెంట్ ఎంఆర్ భాస్కర్.. హోంమంత్రిని పోలీస్ బెటాలియన్‌తో గౌరవందనంతో స్వాగతం పలికారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో పనిచేస్తున్న పోలీసులకు మానసిక ఉల్లాసం కోసం జైళ్ల శాఖ క్రీడలను నిర్వహించడం అభినందనీయమని కొనియడారు. ఖైదీలకు సత్‌ప్రవర్తన కల్పించడానికి వార్డెన్లు చేస్తున్న కృషి మరవలేనిదని తెలిపారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైనీలకు ఉపాధి ఆవకాశలు కల్పి