రంగారెడ్డి

శివపార్వతుల కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 16: శ్రీశివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శనివారం శ్రీశివమారుతి గీతా అయ్యప్ప మందిరంలో శ్రీగిరిజ అమృత లింగేశ్వర స్వామి 46వ కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణ మండపంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వేద మంత్రోచారణాల మధ్య వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివమాల ధరించిన స్వాములు భక్తిగీతాలు అలపించారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం శివస్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వ్యాపారవేత్త బెజుగం రమేష్, డీ.రామకృష్ణ, అగ్గనూరి బస్వం, గోలెపు శేఖర్, బెజుగం రమేష్, రామకృష్ణ, విశాల, దాస కృష్ణయ్య, సంగయ్య, ఒగ్గు కిశోర్ పాల్గొన్నారు.
సాంకేతిక రంగాల్లో రాణించాలి
కుషాయిగూడ, ఫిబ్రవరి 16: విద్యార్థులు విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ ఆణుపురం కాలనీలోని గ్రీన్ హోక్స్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్‌ఫేయర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పావని రెడ్డి, కుషాయిగూడ ఆర్టీసీ మేనేజర్ జగన్ పాల్గొన్నారు. విద్యార్థులకు సాంకేతిక రంగాల్లో ప్రతిభను కనబరిచేలా ఉపాధ్యాయులు విద్యాభోదన అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి కృషి, పట్టుదలతో చదివితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై విజ్ఞాన ప్రదర్శనలో చూపించిన విధానం చూపరులను మరింతగా ఆకట్టుకున్నాయని కార్పొరేటర్ పావని రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మణిపాల్ రెడ్డి, బెతాల బాల్‌రాజు, సుదర్శన్ రెడ్డి, జయపాల్ రెడ్డి, గ్రీన్ హోక్స్ డైరెక్టర్ పటేల్, శ్రీరతన్ కుమార్, మహేష్ పాల్గొన్నారు.