రంగారెడ్డి

వీర జవాన్లకు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, ఫిబ్రవరి 16: ఉగ్రదాడిలో హతులైన జవాన్లకు నివాళిని మండలంలోని పలు విద్యాలయాల విద్యార్థులు అర్పించారు. ముజాహిదపురం ఆదర్శ, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు, మండల కేంద్రంలోని కేవీఎం పాఠశాల విద్యార్థులు ప్రార్థనానంతరం రెండు నిముషాల సేపు వౌనం పాటించారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు మానవహారంగా మారి నివాళులు అర్పించారు. మండల కేంద్రంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చౌడాపురంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శ్రద్దాంజలి ఘటించారు.
జీడిమెట్ల: ప్రపంచ పటంలో పాకిస్థాన్ అనే దేశం లేకుండా చేయాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి అన్నారు. షాపూర్‌నగర్‌లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ బక్క శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగ్రవాదులు, పాకిస్థాన్ దేశ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్లకు నివాళి అర్పించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ మట్టుపెట్టాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నట్‌రాజ్ గౌడ్, దీపక్, గణేశ్, సునిల్, రాజేశ్వరి, శ్రీనివాస్, రఘుపతి, బలరాం, కేశవ్, శ్రీరాములు, రఘుపతి రెడ్డి, లక్ష్మణ్, దయాకర్, మల్లారెడ్డి పాల్గొన్నారు.
తలకొండపల్లి: వీర జవానుల త్యాగాలు వృథా పొనివ్వద్దని చెన్నారం సర్పంచ్ తీపిరెడ్డి స్వప్నారెడ్డి అన్నారు. చెన్నారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, పాకిస్థాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉప సర్పంచ్ వరలక్ష్మీ, వార్డు సభ్యులు భాగ్యలక్ష్మీ, సునీత, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కొండల్ రెడ్డి, గ్రామస్థులు అనంతమ్మ, శివలక్ష్మీ, యాదమ్మ, రాజు, పాండు పాల్గొన్నారు.
షాద్‌నగర్ రూరల్: ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత వీర జవాన్లకు స్థానిక నేతలు నివాళి అర్పించారు. శనివారం షాద్‌నగర్ ముఖ్యకూడలిలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతోపాటు వీర జవాన్ల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. యువసత్తా యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, హిందూ వాహిని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చెట్ల వెంకటేష్, విహెచ్‌పీఎస్ రాష్ట్ర కోశాధికారి బండారి రమేష్, జిల్లా కార్యదర్శి మఠం రాచయ్య, అఖండ అధ్యక్షుడు రంగయ్య, హిందూ వాహిని సభ్యులు క్యామ మహేష్, ఆంజనేయులు, మఠం రుషికేష్, ఆకుల ప్రదీప్, గుండాల రమేష్, దేవేందర్, యాదయ్య పాల్గొన్నారు.
కొత్తూరు: పూల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు స్థానిక బీజేపీ నేతలు నివాళి అర్పించారు. ఇన్ముల్‌నర్వ గ్రామంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు భవాండ్ల మాణిక్యం ఆధ్వర్యంలో కొవొత్తులతో ర్యాలీ నిర్వహించి ముఖ్యకూడలిలో అమర జవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి కుమ్మరి మహేష్, ఓబీసీ అధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీరామ్, కే.లింగం నాయక్, ఎంపీటీసీ బలవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కొందుర్గు: పూల్వామా దారుణ మరణకాండకు వ్యతిరేకంగా కొందుర్గులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి వీరజవాన్లకు నివాళి అర్పించారు. ఆక్స్‌ఫర్డ్ మోడల్ స్కూల్ యజమాన్యం, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ చంద్రబాబు, శివ, కృష్ణకుమార్, చిన్న ఉన్నారు.
కేశంపేట: పూల్వామాలో సీఆర్‌పీఎఫ్‌పై జరిగిన దాడికి నిరసనగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చౌలపల్లిలో సర్పంచ్ వీరేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వనస్థలిపురం: దేశానికి తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవానులకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో నివాళి అర్పించారు. మన్సూరాబాద్ వివేకానందనగర్ కాలనీలోని ఓం విద్యాలయం పాఠశాల విద్యార్థులు శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీర జవానులకు నివాళి అర్పించారు. మన్సూరాద్ నుంచి పురవీధుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు డా.సుగుణాకర్ రావు, చైర్మన్ ఆనంద్ కుమార్, ప్రిన్సిపాల్ చంద్రయ్య పాల్గొన్నారు.
జవాన్లపై దొంగచాటున దాడికి పాల్పడిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దిష్టిబొమ్మను శనివారం టీఆర్‌ఎస్ నేతలు బీఎన్‌రెడ్డి నగర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ యువజన విభాగం మాజీ ఇన్‌చార్జి మాధవరం నర్సింహా రావు మాట్లాడుతూ భారత్ జవానులపై దాడికీ పాల్పడిన తీవ్ర వాదుల సంఘటన హేమమైన చర్యని, పాకిస్థాన్‌కు దమ్ము ధైర్యం ఉంటే భారత్‌తో నేరుగా తలపడాలని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉదయ్ రెడ్డి, గుర్రం శ్రీకాంత్ రెడ్డి, బత్తుల నాగార్జున గౌడ్, నర్ర ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్ కురుమ, శివ, మల్లికార్జున్, అరుణ్, హరినాథ్, సాయి, అశోక్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా ఇబ్రహీంపట్నంలో విద్యార్థులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. సెయింట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సుమారు 2500 మంది విద్యార్థులు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న సెయింట్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సీతారాంపేట్‌లోని హెచ్‌ఆర్‌డీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంగళ్‌పల్లి గ్రామ సమీపంలోని శ్రీఇందు కళాశాలలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన జవాన్‌లకు నివాళి అర్పించి, శాంతి ర్యాలీ నిర్వహించారు.
మెహిదీపట్నం: ఉగ్రదాడిల అమరులైన సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని స్వచ్ఛంద సంస్థలు, పార్టీలతో ప్రమేయం లేకుండా నాయకులు, పలు ప్రభుత్వ కార్యాలయాలలో కూడా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వీర జావానుల వీర మరణానికి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారూఖీ కొవ్వొత్తులు వెలిగించి అమర వీర జవాన్లుకు నివాళ్లు అర్పించారు.
డీఈఈ శంకర్, ఏఈలు శ్రీకాంత్, శ్రీనివాస్, వార్డు సభ్యుడు గురజాల ప్రహళ్లాద్ యాదవ్ పాల్గొన్నారు. లంగర్‌హౌస్‌లోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాబురావు, వెంకటేశ్ గుప్తా, కృష్ణమూర్తి, శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి: భారత సైనికులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ బీహెచ్‌ఈఎల్ కార్మికులు.. పాకిస్థాన్ జెండా, టెర్రరిస్టుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శనివారం భెల్ మెయిన్ గేట్ ముందు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అమర జవాన్‌లకు నివాళులు అర్పించారు. టౌన్‌షిప్ నుంచి లింగంపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఎంఎస్ నాయకుడు రాజ్‌కుమార్ పాల్గొన్నారు.