రంగారెడ్డి

నీటి కోసం రోడ్డుపై ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 17: కొన్ని నెలలుగా నాగారంలోని పలు కాలనీల్లో తాగునీరు సరిగా రాకపోవడంతో పలు కాలనీలకు చెందిన వారంతా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆదివారం ఖాళీ బిందెలు, కుండలతో ప్రధాన రోడ్డుపైకి చేరుకొని నిరసన తెలిపారు. కుషాయిగూడ, కీసర వెళ్లే ప్రధాన రహదారిపై కాలనీ వాసులంతా బైఠాయించి నిరసన తెలిపారు. నాగారం బీజేపీ నేతలు ధర్నా చేస్తున్న ప్రజలకు సంఘీభావం తెలిపారు. జలమండలి అధికారులు తరలి రావాలని, నీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. గంటపాటు రోడ్డుపై నిరసన తెలపటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. పోలీసులు రాకతో ఆందోళన కారులు గ్రామ పంచాయతీ వద్ధకు వెళ్లి నిరసన తెలియ జేసారు. రింగ్‌రోడ్డు లోపల ఉన్న గ్రామాల్లో జలమండల నీటి సరఫరా చేస్తోంది. పనులు పూర్తి కాకపోవటంతో కొంతమేర నీటి సమస్య ఉన్న మాట వాస్తవమేనని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో రోజుకు ఐదు లక్షల లీటర్లను ట్యాంకర్లతో నీటి సమస్య ఉన్న కాలనీలకు సరఫరా చేస్తున్నామని అన్నారు. ఆదివారం కావటంతో అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు వెనుతిరిగి వెళ్లారు. నీటి సమస్యలు తీర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రజలు హెచ్చరించారు.