రంగారెడ్డి

వీర జవానులకు అశ్రునివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 17: కాశ్మీర్‌లో టెర్రరిస్టుల దాడిలో వీర మరణం పొందిన జవానులకు ఆదివారం ఎల్బీనగర్‌కు చెందిన పలు పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పలు కాలనీలలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహంచి, వీర జవానులకు శ్రద్ధాంజలి ఘటించారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పాల్గొని అమరవీరుల చిత్రపటాలకు నివాళి అర్పించి కొద్ది సేపు వౌనం పాటించారు. మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్‌రెడ్డి, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాంపల్లి రామేశ్వర్, విజయ్ కుమార్, రవి శంకర్, కృష్ణం రాజు, సంజీవరెడ్డి, మల్లేష్ గౌడ్, అలీం, నరేష్ యాదవ్ పాల్గొన్నారు.
తలకొండపల్లి: పుల్వామా జిల్లాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ యువజన సంఘాల నాయకులు అమరులైన వీర జవానులకు తలకొండపల్లిలో ఆదివారం వివేకానంద విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. పాకిస్తాన్‌కు భారత్ బలం ఏమిటో ఒక్కసారి రుచి చూపించాలని దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మల్లేష్, శేఖర్, ఎండి సజ్జుపాషా, మల్లేష్, వెంకటాచారి, వెంకటయ్య, నరేష్ భద్రకుమార్, మల్లేష్ పాల్గొన్నారు.
ఉప్పల్: ఉగ్రవాదులను అంతం చేయాలని కాచవానిసింగారం సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రవాద దాడుల్లో అసువులు బాసిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ఆదివారం గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. బాలాజీ అంజనాద్రి, మణిదీప్, మహేశ్వర కాలనీలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు రెండు నిమిషాలు వౌనం పాటించి సైనికుల చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఎంపీటీసీ రమేశ్, మాజీ సర్పంచ్ వెంకటేశ్, ఆర్టీసీ ఉప్పల్ వర్క్‌షాప్ గౌరవాధ్యక్షుడు మోటకట్ల భద్రా రెడ్డి, బుడిగె ఐలేష్, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మేడ్చల్: జమ్ము పూల్వామ ఉగ్రదాడిలో అమరులైన అమరజవానులకు ఆదివారం రాత్రి మండలంలోని గౌడవెల్లి గ్రామ పరిధిలోని సాకేత్ భూ సత్వలో కాలనీవాసులు ఘనంగా నివాళులు అర్పించారు. రిటైర్డ్ కల్నల్ సుకుమార్‌తో పాటు కాలనీవాసులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ముష్కరుల దాడిలో అమరులైన జవానులకు నివాళి అర్పించారు. గ్రామ మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి పాల్గొన్నారు. రాజబొల్లారంలో యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వీర జవానులకు నివాళి అర్పించారు.