రంగారెడ్డి

ఐరిస్‌తో రేషన్ సరుకుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 18: వేలి ముద్రలతో ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, భవన నిర్మాణ రంగాల కార్మికులకు ఐరిస్‌తో రేషన్ సరుకులు పంపిణీ చేయాలని మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రేషన్ డీలర్‌తో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో 636 రేషన్ దుకాణాలు ఉన్నాయని చెప్పారు. కీసర, ఘట్‌కేసర్, మేడ్చల్, షామీర్‌పేట్ మండలాల్లోని 104 చౌకధరల దుకాణాలకు ఐరిస్ సౌకర్యం కలిగిన నూతన యంత్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చి, రేషన్ దుకాణ యజమానులకు పంపిణీ చేస్తామని తెలిపారు. పాత ఈ-పాస్ యంత్రాల్లో వేలి ముద్రల ఆధారంగా రేషన్ సరుకులు పంపిణీ చేసేవారని పేర్కొన్నారు. ఐరిస్ యంత్రాలపై రేషన్ డీలర్లకు అవగాహన కలిగించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మ, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
నులిపురుగుల నిర్మూలన
మాత్రలు వేయించాలి
పిల్లలకు నులిపురుగుల నిర్మూనకు అల్బెండర్‌జోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 19 జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్టర్‌ను విడదల చేసారు. జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నులిపురుగుల నిర్మూలనపై ప్రత్యేక శ్రర్ధ వహిస్తుందని, 19 సంవత్సరాలలోపు పిల్లలందరికీ మాత్రలు వేయించాలని వైదాధికారులను ఆదేశించారు. 19న మాత్రలు వేయసుకోని వారికి 23న వేయించాలని అన్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నారా లేదా, అల్పాహారం అందిస్తున్నారా లేదా అధికారులు తెలుసుకోవాలని ఆదేశించారు. వేసవి కాలం అయినందున హరితహారం మొక్కలకు నీరు అందించాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో లక్ష మొక్కలు పెంచాలని కోరారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం యోగి మాన్ ధన్ పథకం ప్రవేశ పెట్టిందని వివరించారు. ఇటుక బట్టీల్లో పని చేసే కార్మికులు, రిక్షా కార్మికులు లేబర్ పెన్షన్ పధకంపై అవగాహన కల్పించాలని, 18 సంవత్సరాలు నిండిన కార్మికులు అర్హులవుతారని, 60 సంవత్సరాలు నిండిన తరువాత నెలకు మూడువేలు పెన్షన్ పొందటానికి అర్హులని తెలిపారు.
కొంచెం స్థలం ఉన్న రైతులు చేపల పెంపకం చేపట్టేవారికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, సద్వినియోగం చేసుకొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాద దాడిలో మృతిచెందిన వీర జవాన్లకు రెండు నిమిషాలు వౌనం పాటించారు. కార్యక్రమంలో డీఆర్వో విజయ కుమారి, జిల్లా వైదాధికారి నారాయణ రావు పాల్గొన్నారు.
అంబేద్కర్, జగ్జీవన్ అడుగుజాడల్లో
ప్రతి ఒక్కరూ నడవాలి
జీడిమెట్ల, ఫిబ్రవరి 18: డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సూరారం డివిజన్ శివాలయనగర్‌లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్ హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ భవన ఆవరణలో జెండాను ఎగురవేసిన అనంతరం మొక్కలను నాటారు. శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా అంబేద్కర్ భవన్‌ను వివేక్ నిర్మించడం గర్వకారణమని అన్నారు. పెళ్లిళ్లకు, వేడుకలకు మాత్రమే కాకుండా నాలెడ్జ్ సెంటర్‌గా రూపొందించాలని, ఐఏఎస్, ఐపీఎస్ స్టడీ సెంటర్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే కేపీ వివేక్ మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ తమ పిల్లలను చదివించాలని సూచించారు. భవిష్యత్తులో పిల్లలకు అందించేది కేవలం విద్య మాత్రమే అన్నారు. ఉన్నత చదువులతోనే జీవితాలు వెలుగుల్లో నడుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఉపకమిషనర్‌లు విక్టర్, విజయ్‌కుమార్, కార్పొరేటర్ సత్యనారాయణ, నాయకులు రాజేందర్ రెడ్డి, మనె్నరాజు, సురేశ్ రెడ్డి, కిషన్ రావు, ఏసురత్నం పాల్గొన్నారు.

అవయవదానంతో పునర్జన్మ
* సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ సుజాత
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18: అవయవాల దానంతో మరొకరికి పునర్జన్మ లభిస్తుందని, అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కవిత చేపట్టిన అవయవదాన సంకల్ప కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే జన్మదిన ఉత్సవంలోపు రూ.50వేల మంది అవయవదానం చేసేలా కృషి చేస్తుందని, ఐదువేల మందితో అవయవదానం చేసేందుకు తనవంతుగా చైతన్యపరుస్తానని చెప్పారు. పలువురు మాజీ కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అవయవదానం అంగీకార పత్రాలను చైర్‌పర్సన్ రాగం సుజాత, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ల సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు దుర్గం వీరేశం గౌడ్, బద్దం కొండల్ రెడ్డి, మేకల కృష్ణ యాదవ్, శ్రీకళ, కవిత, రాము, గోపి, శ్రీనివాస్, రాజు, విజయ్, రవి, చంద్రకళ, భాగ్యలక్ష్మీ, కళ్యాణి, నర్సింగ రావు, ఆమోస్ పాల్గొన్నారు.