రంగారెడ్డి

‘జవాన్లపై దాడి.. పిరికిపంద చర్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఫిబ్రవరి 18: వీరజవాన్లపై దాడి పిరికి పందల చర్యగా మహేశ్వరం ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రారెడ్డి అభివర్ణించారు. సోమవారం జల్‌పల్లి మున్సిపాలిటీ వాది ముస్త్ఫా బస్తీలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సబితా రెడ్డి, సరూర్‌నగర్ ఎంపీపీ తీగల విక్రం రెడ్డి పాల్గొని, అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. సబితా రెడ్డి మాట్లాడుతూ దేశ సేవలో అమరులైన జవాన్ల త్యాగం వృధకాదని పేర్కొన్నారు. సరూర్‌నగర్ వైస్ ఎంపీపీ ఓమర్ బామ్, జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు కౌసర్ బామ్, జల్‌పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సూరెడ్డి కృష్ణా రెడ్డి, ఎంటీసీలు షేక్ అఫ్జల్, సమ్మద్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, బాలాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ యూసుప్ పటేల్, ఖలేద్ పాల్గొన్నారు.
కొందుర్గు: ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన అమరవీరులకు నివాళి అర్పించారు. సోమవారం కొందుర్గు మండల కేంద్రంలో సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ముఖ్యకూడలిలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించడంతోపాటు ఉరి తీయాలని డిమాండ్ చేశారు. జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో సర్పంచ్ కమ్మరి భూపాలచారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జీహెచ్‌ఎం రవీందర్ రెడ్డి, సాయి ఫౌండేషన్ సభ్యులు జనార్దన్ గౌడ్, ప్రకాష్, విజయ్ కుమార్, లింగం గౌడ్, యశోద, గోవింద్ పాల్గొన్నారు.
ఘట్‌కేసర్: పుల్వామాలో ఉగ్రవాదుల బాంబు దాడిలో మృతిచెందిన అమర వీర జవాన్ల మృతికి సంతాపంగా శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సోమవారం కొవ్వత్తులు వెలిగించి ర్యాలీ జరిపారు. అమర జవాన్ల మృతికి సంతాపం తెలిపారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాల డైరక్టర్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కోరుకుంటున్న భారత్‌పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ చల్లా శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శివారెడ్డి పాల్గొన్నారు.
కొడంగల్: ఉగ్రవాదుల చేతిలో అమరులైన జవాన్‌లకు అంగన్‌వాడీ టీచర్లు నివాళి అర్పించారు. సోమవారం కొడంగల్‌లోని ఐసీడీఎస్ సీడీపీవో జయరామ్ నాయక్ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని కేఎస్‌వీ ఫంక్షన్ హాల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తులను వెలిగించి అమరుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు.
కాచిగూడ: ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్లపై పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ శ్రీసాయి సేవ సంఘం, ఉజ్వల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కొవొత్తుల ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు చుక్క జగన్, రాజుగౌడ్, మల్లేష్, సతీష్, శ్రీను, విజయ్ కుమార్, అబీబ్ పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించారు.
జీడిమెట్ల: అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత కేఎం ప్రతాప్ ప్రార్థించారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తాలో ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు యువనేస్తం ఫౌండేషన్, సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. కుత్బుల్లాపూర్ గ్రామం నుంచి వెంకటేశ్వర నగర్ మీదుగా చింతల్ మెయిన్ రోడ్డు, కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో భారీ ఎత్తున పాదయాత్ర చేశారు. ప్రతాప్ మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రాణ త్యాగాలను అర్పించే సైనికులను ఎన్నటికీ మరువరాదని, వారి త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. విశాల్ గౌడ్ పాల్గొన్నారు.
బాచుపల్లి గ్రామంలో ఉగ్రవాద దుశ్చర్యలో అమరులైన జవాన్‌ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పీస్ ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులను వెలిగించి బాచుపల్లి గ్రామం హిల్ కౌంటీ నుంచి నిజాంపేట్ వాటర్ ట్యాంక్ వరకు ర్యాలీగా తిరుగుతూ నివాళి అర్పించారు. కార్యక్రమంలో బాచుపల్లి సీఐ జగదీశ్వర్, నేతలు కాసాని వీరేశ్ కాలనీ వాసులు, పెట్రోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రగతినగర్‌లో కొవ్వొత్తులను వెలిగించి అమర జవాన్లకు ఎస్సై సతీశ్ కుమార్ పాల్గొని నివాళి అర్పించారు.