రంగారెడ్డి

ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 18: రానున్న ఎన్నికలను శాంతియుతంగా, సక్రమంగా నిర్వహించాలని అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం రాజేంద్రనగర్‌లో వివిధ పార్టీల సమక్షంలో నిర్వహించిన మాక్ పోలింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మాక్ పోలింగ్‌తో ఆయా పార్టీలకు ఎన్నికల పట్ల ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఎన్నికల్లో ఎటువంటి జాప్యం, సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల జాబితాలు అన్నింటిని సరి చూసుకోవాలని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాలు ఉంటే అధికారులకు తెలియజేయాలని వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ఎన్నికల్లో ఉపయోగించిన మూడు వేల ఈవీఎంలను ఈసారి వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరీష్, అధికారిణి ఉషారాణి, ఆర్డీవో చంద్రకళ, రాములు అన్ని పార్టీల నాయకులు, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ టీ.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ
బొంరాస్‌పేట, ఫిబ్రవరి 18: కోరిన భక్తుల కొంగు బంగారం.. గ్రామీణ ప్రాంత ప్రజల ఇలవేల్పు పోలేపల్లి ఎల్లమ్మ దేవత విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం కన్నుల పండువగా సాగింది. మూడు రోజుల పాటు సాగిన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు సోమవారంతో ముగిసాయి. కోటి రూపాయల వ్యయంతో అమ్మవారి ఆలయాన్ని కొత్తగా నిర్మించారు. దేవాదాయ శాఖ మంజూరు చేసిన నిధులతో పాటు ఆలయ నిర్మాణ దాత ముచ్చటి వెంకటేష్‌తో పాటు మహారాష్ట్ర షోలాపూర్‌కు చెందిన భక్తులు ఇచ్చిన విరాళాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. స్వయంభుగా వెలసిన అమ్మవారి విగ్రహాన్ని యథావిధిగా ఉంచి నిర్మాణ పనులు పూర్తి చేశారు. అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో షోలాపూర్ భక్తులు సందడి చేశారు. మరికొందరు ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తున్న సమయంలో జయజయ ధ్వనాలు చేశారు. భక్తులకు అమ్మవారి దర్శణం, తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.