రంగారెడ్డి

బంగారు తెలంగాణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 18: బంగారు తెలంగాణే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి మహమ్మద్ అలీ వ్యాఖ్యానించారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోపరేటివ్ మేనేజ్‌మెంట్‌లో 67వ సెషన్ ఆఫ్ హయ్యర్ డిపొమా ఇన్ కోపరేటివ్ మేనేజ్‌మెంట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బంగారు తెలంగాణలో సహకార వ్యవస్థ అత్యంత కీలక పాత్ర వహించాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి 29 శాతానికి పెరిగిందని చెప్పారు. తెలంగాణలో శాంతిభద్రతలు అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటున్నామని వివరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రగతి - కేసీఆర్ నాయకత్వం అనే సీడీని రిలీజ్ చేశారు. కార్యక్రమంలో హెచ్ ఎస్‌కే తంగిరాల డైరెక్టర్ రామదాసప్ప నాయుడు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.

గంగారం చెరువు సుందరీకరణ
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 18: చెరువులను ప్రక్షాళన చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం రూ.19 కోట్ల జీహెచ్‌ఎంసీ నిధులతో చేపట్టనున్న గంగారం చెరువు అభివృద్ధి పనులకు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రూ.31.26 కోట్ల నిధులతో నీటి పారుదల శాఖ సహకారంతో గంగారం పెద్ద చెరువు, మియాపూర్ పటేల్ చెరువులను, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మియాపూర్‌లోని గురునాథ్ చెరువు, హఫీజ్‌పేట కాయిదమ్మ కుంటలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరగా వాకింగ్ ట్రాక్‌లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. గంగారం పెద్ద చెరువు అభివృద్ధిలో భాగంగా వాకింగ్ ట్రాక్, యోగా గ్యాలరీ, సైకిల్ ట్రాక్, ఆట స్థలం, జిమ్, బోట్ జెట్టీ, స్టాల్స్, ఫుడ్‌కోర్టు, టాయిలెట్ల సౌకర్యం కల్పిస్తామని కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ఓఎస్‌డీ శేఖర్ రెడ్డి, సిటీ ప్లానర్ ఆర్.శ్రీనివాస్ రావు, ఎస్‌ఈ గంగాధర్, ఈఈ ఖుర్షీద్, డీఈ ప్రసిద్ధ, ఏఈ శేషగిరి రావు, శివరాం హాజరయ్యారు. నాయకులు పారునంది శ్రీకాంత్, దొంతి శేఖర్, ఉప్పలపాటి శ్రీకాంత్, జీ.లక్ష్మారెడ్డి, వాలా హరీష్ రావు, సలీం, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అనంత రెడ్డి పాల్గొన్నారు.