రంగారెడ్డి

యువత శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆరెకటికె సంఘం ఆధ్వర్యంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హైందవ జాగృతికి, భారతీయుల హిందూ సంరక్షణకి ఎంతో కృషి చేశారని వివరించారు. అనేక యుద్ధాలు చేసి హిందూ సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్నారని, మహావీరుడు ఛత్రపతి శివాజీని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతి, హైందవ ధర్మ రక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు ఛత్రపతి శివాజీ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ యుగంధర్, నరేందర్, బచ్చలి నర్సింహా, ఆరెకటిక సంఘం అధ్యక్షుడు బల్లు కమిటీ సభ్యులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కొందుర్గులో..
కొందుర్గు: మంగళవారం కొందుర్గులో బిజేపి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శివాజీని ఆదర్శంగా తీసుకొని ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్‌ను బిజేపీ కోశాధికారి శాంతకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతకుమార్ మాట్లాడుతూ, పేదల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహానేత ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. శివాజీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో పయనిస్తూ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ క్యార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్‌పటేల్, కావలి యాదయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, శివాజీ యూత్ సభ్యులు నరేందర్, మధు, శ్రీను, లింగం, యాదగిరి పాల్గొన్నారు.
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డి నగర్ శివాజీ చౌక్ వద్ద చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి, బీజీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హెచ్‌ఏఎల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.మల్లారెడ్డిలు విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో విచ్చేసిన సంఘ సేవకులకు పురస్కారాలను అందజేశారు. మహిళలకు చీరలను పంపిణీ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కిషన్ రెడ్డి, మల్లారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల్లో శివాజీ ఒకరని, శివాజీ యువతకు స్ఫూర్తి దాయకులని చెప్పారు. శివాజీని ఆదర్శంగా తీసుకుని యువకులంతా దేశ రక్షణకు, హిందూ రక్షణకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మీసాల చంద్రయ్య, బక్క శంకర్ రెడ్డి, శివాజీ సేవా సమితి సభ్యులు రవిందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పరిశ వేణు, కృపాకర్, ఆషా, రాజేశ్వరి, సంజుమానె, అనిల్ సూర్య వంశి, లక్ష్మన్ రావు, గజానంద్, నారాయణ గౌడ్, దేవా, రవికిరన్, డీజే రాజు, దీపక్ ముదిరాజ్ పాల్గొన్నారు.
కేశంపేట: ఛత్రపతి శివాజీ 392వ జయంతి వేకుడలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం కేశంపేట మండల కేంద్రంలో ఆరె కటిక పోరాట సమితి యువత రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శివాజీ, కేశంపేట సర్పంచ్ వెంకట్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ కే.నవీన్‌కుమార్, కేశంపేట ఉప సర్పంచ్ మల్లేష్, పాపిరెడ్డిగూడ వార్డు సభ్యుడు నరేందర్, ఆరెకటిక పోరాట సమితి సభ్యులు నరేష్, నాగేశ్వర్, పాండు, రమేష్, నాగేష్, యాదయ్య, నరేష్, కృష్ణ, వెంకటేష్, రాజేష్, నవీన్, వంశీ, శివనందులు పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఆవుల ఆంజనేయు, రాఘవేంద్ర, నరేష్, అశోక్, హరీష్, అవినాష్, గణేష్, పాకిరయ్య, శివ, నందుకుమార్ పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ అశోక చక్రవర్తి హాజరయ్యారు. శివాజీ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ సురేష్, కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత రావుల జంగయ్య, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీరామ్‌రెడ్డి, బీజేపీ నాయకులు మల్లారెడ్డి, ఎంఐఎం నాయకుడు ప్రవీణ్ నావేందర్, గురుద్వారా అధ్యక్షుడు సుఖదేవ్ సింగ్, శివాజీ మహారాజ్ యువ సమితి అధ్యక్షుడు గోవింద్ ఖండారే, ప్రధాన కార్యదర్శి దత్త బిరాదర్, ఉపాధ్యాక్షుడు రత్నేష్ యాదవ్, కోశాధ్యాక్షుడు కేశవ్ ఖండారే, జాయింట్ సెక్రటరీ ధనరాజ్, రాజేష్ శర్మ, తులసీ జాదవ్, మహాదేవ్, లింబ్రాజ్, సందీప్, అమర్, మురారి, అంకున్, దిలీప్, సంజయ్, నిలేష్, దత్త, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి: ఛప్రతి శివాజీ జయంతి సందర్భంగా మర్పల్లి ఇతర గ్రామాల్లో ఉత్సవాలను నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళి అర్పించారు. శివాజీ యువజన సంఘం సభ్యులు, ఎంపిటిసి శేఖర్, సలీం, మధుకర్‌రెడ్డి యువకులు పాల్గొన్నారు.
ఉప్పల్: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు మంగళవారం రామంతాపూర్‌లో ఘనంగా జరిగాయి. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిండేరు హన్మంతరావు, సభ్యులు మిలియన్ జీ, ఓబుల్ కుమార్, అరవింద్ కుమార్, కొత్తపల్లి రమేశ్, సోమ శ్రీనివాస్ పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకు ముందు రామంతాపూర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
బోడుప్పల్‌లో మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దాసరి మహేష్ యాదవ్, నాయకులు లక్ష్మయ్య, వెంకటేశ్, జోషి, ప్రదీప్, రాధిక, సంధ్య పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఘట్‌కేసర్: పోరాట యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘట్‌కేసర్‌లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మండల ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు నానావత్ శివాజీ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. భారత దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు చత్రపతి శివాజీ చేసిన ఉద్యమాలు ప్రతి ఒక్కరిని ప్రేరేపించినట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మహేష్, జ్ఞానేందర్, రామ్, రాజకుమార్, మల్లికార్జున్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మేడ్చల్: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను మంగళవారం మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మునీరాబాద్ గ్రామంలో సర్పంచ్ చిట్టిమిల్ల గణేశ్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. జై భవానీ వీర శివాజీ నినాదాలు చేస్తూ గ్రామంలో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. గిర్మాపూర్ గ్రామంలో, మాధవరెడ్డి చౌరస్తాలోని శివాజీ విగ్రహాలకు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మునీరాబాద్ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింగ్ రావు, వార్డు సభ్యులు నరేందర్, రమేశ్, శ్రీవాణి, దుశ్యంత్ రెడ్డి, భిక్షపతి, రాజశేఖర్, మధు, బాబు, మహేశ్, ఎల్లం, మహబూబ్, ఆర్య, భరత్, రాకేశ్, ఆంజనేయులు పాల్గొన్నారు. గిర్మాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేత మెట్టు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఘట్‌కేసర్: భారతీయులలో విప్లవాన్ని రగిలించి స్వాతంత్య్రమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ఉద్యమించేలా స్ఫూర్తి నింపిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని సంస్కృతి టౌన్‌షిప్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్టు బాల్‌రెడ్డి అన్నారు.
పోచారం మున్సిపాలిటి అన్నోజిగూడలో ఏనుగు యాదలక్ష్మి ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన శివాజీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మత సామరస్యాన్ని పాటించి ప్రజలను కన్నబిడ్డల మాదిరి చూసుకుని భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయుడు శివాజీ అన్నారు. ధైర్యశాలి అయిన శివాజీ వీరత్వం ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తి రగిలించిందని చెప్పారు. శివాజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని కలిగి ఉండాలని, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏనుగు యాదలక్ష్మి ట్రస్టు చైర్మన్ ప్రతాపరెడ్డి, సీతాపతి, సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డి, విజయారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్: శివాజీ జయంతి ఉత్సవాలను పట్టణంలోని శివరాంనగర్‌లో యువకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. ఆనంద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం అన్ని మతాలు, కులాలు కలిగిన సర్వసత్తాక, సామ్యవాద, సౌభ్రాతృత్వ దేశమని ఆయన అన్నారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలుగకుండా ఎవరి కులాన్ని, ఎవరి మతాన్ని వారు అభివృద్ధి చేసుకునే అవకాశం మన రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నవీన్, క్రాంతి, గిరీష్ కొఠారి పాల్గొన్నారు.