రంగారెడ్డి

ఈవీఎంలపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 19: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న క్రిందిస్థాయి సిబ్బందికి, పోలీసు సిబ్బంది, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈవీఎంలపై అవగహన కల్పించాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి గ్రామంలోని పాఠశాలలో చునావ్ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. గ్రామాల్లో ఎంచుకున్న చునావ్ పాఠశాలల్లో మార్చి 5 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాధికారులతో పాటు, వీఆర్‌వో, వీఆర్‌ఏ, అంగన్‌వాడి టీచర్లు, గ్రామ కార్యదర్శులు, పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన, మున్ముందు చేపట్టాల్సిన పనులపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికలకోసం అదనంగా ఉన్న ఈవీఎంలు, శాసనసభ ఎన్నికల్లో వినియోగించని ఈవీఎంల పూర్తి వివరాలను తెలుసుకుని పార్లమెంట్ ఎన్నికలకు అవసరమైన మరికొన్ని ఈవీఎంలను పక్క జిల్లాల నుంచి తెప్పించునేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అన్నపూర్ణ, జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ ముజామిల్‌ఖాన్, డీఆర్‌డీవో జాన్సన్, ఆర్‌డీవో విశ్వనాథం పాల్గొన్నారు.