రంగారెడ్డి

ఓటరు జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 19: ఈనెల 20వ తేదీలోపు ఓటరు జాబితాను వెబ్‌సైట్‌లో ఈఆర్వో, ఏఈఆర్వోలు పొందుపర్చాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి ఈఆర్వో, ఏఈఆర్వోలతో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్‌ఓలు ఓటరు జాబితాలోని పేర్లు, ఫోటోలు క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టి, ఈనెల 22వ తేదీన ప్రచురణకు సిద్ధం చేయాలని కోరారు. ఏవైనా పొరపాట్లు జరిగితే బీఎల్‌ఓలు, సూపర్ వైజర్లు, ఏఈఆర్వోలు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎక్కడైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ప్రతి దివ్యాంగుడిని ఓటరుగా నమోదు చేయించాలని, ఓటు వేయించే బాధ్యత నోడల్ అధికారులపై ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్‌లు, ర్యాంప్‌లు, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ రూపొందించిన సీవిజిల్ యాప్, ఫిర్యాదుల స్వీకరణ నెంబర్ 1950 నెంబర్‌ర్లను విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ప్రజలకు ఓటు హక్కుపై ఈవీఎం, వీవీప్యాట్‌ల ద్వారా అవగాహన కల్పించాటానికి స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసుల సహాయంతో గుర్తించాలని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వౌలిక వసతులు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో విజయ కుమారి పాల్గొన్నారు.
ఓయూలో పీడీఎస్‌యూ ర్యాలీ
నాచారం, ఫిబ్రవరి 19: పీజీ, పిహెచ్‌డీ విద్యార్థులకు ఫెలోషిప్స్ విడుదల చేయాలని కోరుతూ ఓయూ కామర్స్ కాలేజీ నుండి పరిపాలన భవనం వరకు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఓయూ వార్షిక బడ్జెట్‌లో పీజీ, పీహెచ్‌డీ విద్యార్ధులకు ప్రతి నెల రూ.3000 నుంచి 8000 వేలు ఫెలోషిఫ్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రుసా నిధులు 100కోట్లతో వసతిగృహ భవన నిర్మాణం చేయలని, పీజీ, పీహెచ్‌డీ విద్యార్ధులకు స్కాలర్స్‌కు ల్యాప్‌టాప్స్, మెస్ చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓయూలో విద్యార్ధులకు సరైన వసతిగృహం లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అధికారులు నిధులు విడుదల చేసి నిర్మించాలని సూచించారు. ఈకార్యక్రమంలో పీడీఎస్‌యూ విద్యార్ధి సంఘల నాయకులు పాల్గొన్నారు.