రంగారెడ్డి

షాద్‌నగర్‌కు క్రైమ్ కంట్రోల్ స్టేషన్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 20: షాద్‌నగర్‌లో క్రైమ్ కంట్రోల్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, నేరాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత ఏడాదితో పోల్చితే నేరాల నమోదు గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నేరాల సంఖ్యను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నేనుసైతం అనే కార్యక్రమంలో భాగంగా చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. షాద్‌నగర్ డివిజన్‌లో ఇప్పటి వరకు వేయి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, మున్ముందు మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఐదు వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అనుగుణంగానే ఏర్పాటు చేయడంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రజలందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు. దాంతో శాంతిభద్రత పరిరక్షణకు ఎలాంటి విఘాతం కలగదని, నేరాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు ప్రత్యేకంగా క్రైమ్ కంట్రోల్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దాంతో క్రైమ్ రేటు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. షాద్‌నగర్‌లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడంతో కొంతమేరకు ప్రయోజనం లభిస్తుందని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్‌ను పాటించేందుకు కృషి చేయాలని సూచించారు. హెల్మెట్ లేకుండా, మద్యం తాగి వాహనాలను నడిపిస్తే వారి లైసన్స్‌లను రద్దు చేయడంతోపాటు తగిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలపాలని, ఇష్టారాజ్యంగా నిలిపితే చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్‌నగర్ ఎసీపీ సురేందర్, సీఐలు శ్రీ్ధర్‌కుమార్, చంద్రశేఖర్, ట్రాఫిక్ సీఐ సునీల్ పాల్గొన్నారు.
నాణ్యమైన వైద్యం అందించాలి
ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా కృషి చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. బుధవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జీవన్ దాన్’ పథకం గురించి ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని అన్నారు. బ్రెయిన్‌డెడ్‌తో చనిపోయిన వారి అవయవాలను, వారి కుటుంబ సభ్యుల సహకారంతో దానం చేసే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. చనిపోయిన వారి అవయవదానం వల్ల ఇతరుల జీవితాలు కాపాడవచ్చని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన వారమవుతామని వివరించారు. వైద్యులపై జరిగే దాడులను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసుపత్రులు, వైద్యులపై జరిగే దాడులకు పోలీసుల ద్వారా పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, ప్రజలందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడే ప్రతి వైద్యునికి ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే విధంగా వైద్యులు కృషి చేయాలని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే క్రమంలో వైద్యులంతా కూర్చుని చర్చించుకోవడానికి భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని సేవలందించడానికి ఈ భవన నిర్మాణానికి కృషి చేసిన వైద్యులను అభినందించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్ రెడ్డి, షాద్‌నగర్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి విశ్వం, షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్లు దిలీప్‌చంద్ర, నాగిరెడ్డి, చైతన్య, బండారి రమేష్, నాగవర్ధన్, శారద, టీఆర్‌ఎస్ నేతలు పాతూరి వెంకట్ రావు, కే.నరేందర్, బాబర్, ఎస్‌డీ ఇబ్రహీం, వంకాయల నారాయణరెడ్డి, షాద్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ.జగన్మోహన్ రెడ్డి, చింటూ, బచ్చలి నర్సింహా పాల్గొన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు ఐదు లక్షల విరాళం
షాద్‌నగర్ రూరల్: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఐదు లక్షలు విరాళంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు చెక్కును అందజేశారు. బుధవారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ సజ్జనార్‌కు బిల్డింగ్ బ్లాక్ యజమాని మధుసూదన్ రెడ్డి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. డివిజన్‌లో పది గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఐదు లక్షల చెక్కును పోలీస్ కమిషనర్‌కు అందించినట్లు యజమాని వివరించారు. బిల్డింగ్ బ్లాక్ యజమాని మధుసూదన్‌రెడ్డిని అభినందించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేందుకు కృషి చేయాలని పోలీసులు కోరారు.
అంబులెన్స్‌కు ప్రత్యేక దారి ఇవ్వండి: డీసీపీ
ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ వద్ద అంబులెన్స్‌కోసం ప్రత్యేకంగా దారిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టోల్‌గేట్ యజమాన్యానికి శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి సూచించారు. అంబులెన్స్ కోసం ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేయకపోతే టోల్‌గేట్ యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. టోల్‌గేట్ నుండి వచ్చిపోయే వాహనాల వివరాలను విధిగా నమోదు చేయడంతోపాటు సీసీ కెమెరాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని అన్నారు. కార్యక్రమంలో సీఐలు శ్రీ్ధర్‌కుమార్, చంద్రశేఖర్, ఎస్‌ఐ విజయ భాస్కర్ ఉన్నారు.