రంగారెడ్డి

పనిచేసే వాళ్లకే పట్టం.. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 23: అంకుఠితమైన దీక్ష కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని.. పనిచేసే వాళ్లకే పట్టమని.. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తానేనని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్ట్ఫాస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మనిషి చిత్తశుద్ధి అంకితభావంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తానేనని ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా పదవులు లభించాయని అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి మేడ్చల్‌లో పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని మంజూరు చేయించి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కార్యాలయానికి భవనం కేటాయించి మంత్రి హోదాలో ప్రారభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ ముందుకుసాగుతానని పేర్కొన్నారు. తాను ఇచ్చిన హామిల్లో భాగంగా త్వరలోనే మేడ్చల్‌లో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. హైదరాబాద్, సికిందరాబాద్ నగరాలు పాతవిగా మారాయని మేడ్చల్‌ను కొత్త నగరంగా తీర్చిదిద్దుతానని వివరించారు. మేడ్చల్‌లో కలెక్టరేటు భవనంతో పాటు త్వరలోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా కేశ్వాపూర్ రిజర్వాయర్ పనులకు కూడా ప్రారంభిస్తామని అన్నారు. మేడ్చల్ జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చిన పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు ప్రతీ వ్యక్తికి పాస్‌పోర్టు సర్వసాధారణంగా మారిందని దళారులను ఆశ్రయించకుండా నేరుగా పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం మేడ్చల్‌లో పాసుపోర్ట్ సేవా కేంద్రానికి తాత్కాలిక భవనం మాత్రమే కేటాయించామని త్వరలోనే పక్కా భవనాన్ని నిర్మిస్తామని మంత్రి హామి ఇచ్చారు. రెండేళ్లలో దేశంలో 367 పాస్‌పోర్టు కేంద్రాలను ప్రారంభించామని రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నాటికి 400 కేంద్రాలను ప్రారంభిస్తామని, తెలంగాణలో 14 కేంద్రాలు మంజూరీ కాగా మేడ్చల్ జిల్లాలో ఒక కేంద్రం మంజూరైందని వివరించారు. కార్యక్రమంలో పోస్టల్‌శాఖ డైరెక్టర్ ఎస్‌వీ. రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త నందారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుగుణ, బాలానగర్‌జోన్ డీసీపీ పద్మజారెడ్డి, ఎంపీపీలు విజయలక్ష్మీ, శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ యాదవ్, జడ్పీటీసీ శైలజ హరినాథ్ అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మల్లారెడ్డికి ఘనస్వాగతం
మంత్రి హోదాలో మొదటిసారి మేడ్చల్‌కు విచ్చేసిన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత పట్టణ ప్రధాన కూడళి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళి అర్పించారు. అక్కడి నుంచి నేరుగా మంత్రికి పట్టణ టీఆర్‌ఎస్ నేత నర్సింహా రెడ్డి ఇంటి వద్ద చేరుకోగా బోనాలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రి రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద సామూహిక భవన నిర్మాణ పనులను ప్రారంభించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకుల మద్దుల శ్రీనివాస్ రెడ్డి, రాజమల్లా రెడ్డి, రవీందర్ రెడ్డి, భాగ్యరెడ్డి, విష్ణు, శేఖర్ గౌడ్, నర్సింహా రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి (టిల్లు), మహాబూబ్‌అలీ, శైలేందర్, జగన్‌రెడ్డి, జకట దేవ, సాయిరజని, దాత్రిక లింగం, నాగరాజు, సందీప్ గౌడ్, మోనార్క్, ఆంజనేయులు, మల్లేశ్, పానుగంటి రవీందర్, పద్మ, శారద పాల్గొన్నారు.