రంగారెడ్డి

ఎల్లమ్మ జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, ఫిబ్రవరి 23: బండల ఎల్లమ్మ జాతర ఉత్సవాలు సాంప్రదాయ ప్రకారం కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం ఆలయ నిర్వహకుల ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకంతోపాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం వ్యవసాయంపై, పశువులపై తల్లీ దివేనలు ఉండాలని కోరుతూ ఎడ్లబండ్లను అంగరంగ వైభవంగా అలంకరించి కొడంగల్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల రైతులు ఎడ్లను ఊరేగిస్తు ఆలయం వరకు వెళ్లి ఆలయం చుట్టు ఐదు మార్లు ప్రదక్షిణలు చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రైతులు ఉల్లాసంగా కార్యక్రమాలను చేపట్టారు.

ఘనంగా జ్యోతిర్లింగ మహాపడిపూజ
షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 23: జ్యోతిర్లింగ మహాపడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శనివారం షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి దేవాలయంలో జ్యోతిర్లింగ మహాపడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మహాపడిపూజ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు అందె మోహన్ ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి మహాపడిపూజను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో భక్తులు సాయివంశీ, ప్రదీప్ ముదిరాజ్, గాజుల నందు, వంశీగౌడ్, రాజేష్, రాజు, నవీన్, తేజ పాల్గొన్నారు.
కొందుర్గు: జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని వనంపల్లి గ్రామంలో గురుస్వామి భూపాలచారి ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ మహాపడిపూజ కార్యక్రమాన్ని శివస్వాములు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి భూపాలచారి మాట్లాడుతూ శివస్వాములు నిష్టతో పూజ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శివస్వాములు యాదవరెడ్డి, కొండి యాదయ్య, శ్రీనివాస్, వీరేందర్‌రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
జవాన్ల ప్రాణత్యాగం స్పూర్తి కావాలి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 23: దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల వీరమరణం యువతకు స్పూర్తి కావాలని, దేశ రక్షణలో యువత భాగస్వాములు కావాలని శ్రీపరివార్ ఆధ్యాత్మిక సేవా సంస్థ యోగాచార్యులు రవీందర్ బాపూజీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ దాడిలో ప్రాణాలు అర్పించిన వీరజనాజవాన్లకు శనివారం స్థానికంగా నివాళి అర్పించారు. శ్రీపరివార్ సంస్థ ప్రతినిధులు రాఘవులు బాపూజీ, రఘుసింగ్ బాపూజీలతో కలిసి ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాల సహాయ నిధికి రూ.లక్ష సహాయాన్ని ప్రకటించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కృషి, పోరాట పటిమ మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో శ్రీపరివార్ సంస్థ ప్రతినిధులు తిరుమల్‌రెడ్డి, రాజేశ్, శ్రీనివాస్, ప్రభాకర్, కృష్ణ, రవీందర్, అయిలయ్య పాల్గొన్నారు.
నగరంలో బెస్ట్ బేబీ కాంటెస్ట్
ఖైరతాబాద్, ఫిబ్రవరి 23: చిన్నారుల్లో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికితీసి ప్రోత్సహించేందుకు నగరంలో హైదరాబాద్ బెస్ట్‌బేబీ కాంటెస్ట్‌ను నిర్వహిస్తుట్టు నిర్వాహకురాలు అనుప్రసాద్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రెడీఫైర్ సంస్థ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నేటి పిల్లలు కేవలం పాఠశాలలకే పరిమితం అవుతున్నారని, తల్లిదండ్రులు సైతం వారిలో ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకు ప్రయత్నించకుండా చదువుకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 17న కంట్రీక్లబ్‌లో కంటెస్ట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేస్తామని చెప్పారు. వివరాల కోసం 9121962963, 9346240019 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఉమ, ప్రియ, సుధజైన్, సంధ్య, హర్ష పాల్గొన్నారు.
నేడు ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ ఫెయిర్
ఖైరతాబాద్, ఫిబ్రవరి 23: ఆస్ట్రేలియా దేశానికి చెందిన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం, కోర్సులు వివరించేందుకు ఆదివారం బేగంపేటలోని తాజ్ వివంతాలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్టు ఏఇసీసీ గ్లోబల్ ప్రాంతీయ అధికారి ఉమా తెలిపారు. సోమాజిగూడలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంస్థ ప్రతినిధి పవన్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. ఆస్ట్రేలియా దేశంలోని ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న 30 యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు ఫెయిర్‌కు హాజరు అవుతున్నట్టు తెలిపారు. ఆయా విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సులు, విసా, స్కాలర్ షిప్ వివరాలను వెల్లడించడంతో పాటు విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేస్తారని చెప్పారు. చదువు కోసం తమ దేశానికి వస్తున్న విద్యార్థులకు రెండు సంవత్సరాల వర్క్ పర్మిట్‌తో కూడిన విసాలను అక్కడి ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. పూర్తి విరవాల కోసం 9912328645 నెంబర్‌లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

తొలి సంఘ సంస్కర్త సంత్ గాడ్గేబాబా
కాచిగూడ, ఫిబ్రవరి 23: ఆధునిక భారతదేశ చరిత్రలో పరిశుభ్రతే దైవమని నిరూపించిన తొలి సంఘసంస్కర్త గాడ్గే బాబా అని వైద్య అరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శ్రీసంత్ గాడ్గే బాబా 143వ జయంతి వేడుకలు మన రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఉన్నత వర్గంలో పుట్టి తాను నమ్మిన ఆశయ సాధక కోసం పని చేశారని పేర్కొన్నారు. గాడ్గే బాబా గొప్ప సామాజిక స్పృహ కలిగిన సామాజిక విప్లవవాది అని కొనియాడారు. మహారాష్టత్రో పాటు దేశం మొత్తం 142 పాఠశాలలను తానే స్వయంగా స్థాపించారని వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ను వందేళ్ళ క్రితమే మహారాష్టల్రో పరిశుభ్రతను స్వచ్ఛ భారత్‌ను ఆవిష్కరించారని పేర్కొన్నారు. దేశానికి గాడ్గే బాబానిస్వార్థ సేవలను అందించారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం. ఉప్పలయ్య, కే.వెంకట్రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, మానస గణేష్, డా.సి రాజా, రవి, మహిళానాయకురాలు రాజేశ్వరి, నిమ్స్ రాజు, ఎంఎన్‌రావు, పాల్గొన్నారు.
ఓయూలో శ్రీ సంత్ గాడ్గ్గేబాబా జయంతి ఉత్సవాలు
కుషాయిగూడ: శ్రీ సంత్ గాడ్గ్గేబాబా జయంతి వే డుకలు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో రజక విద్యార్ధి సంఘం రాష్ట్ర నాయకులు రాగల్ల గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ పితామహుడు శ్రీసంత్ గాడ్గ్గేబాబా మహారాష్టల్రో చిన్న గ్రామంలో జన్మించారని తెలిపారు. గ్రామాల శుభ్రతే లక్ష్యంగా భారత దేశ శుభ్రతకు పూనాదులు వేసి ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప స్వచ్చతకు మార్గదర్శకుడని కొనియడారు. మహారాష్ట్ర గ్రామాల ఆభివృద్ధిలో ప్రజలకు శుభ్రత, సేవా చేయడనికి మార్గదర్శనం చేసిన గొప్ప సేవా దర్శనికుడని పేర్కొన్నారు. భారత దేశ వ్యాప్తంగా వివిధా రాజకీయ పక్షలు, సేవాసంస్ధలు శ్రీ సంత్ గాడ్గ్గేబాబా స్పూర్తిగా తీసుకోని గాడ్గ్గే మహారాజ్ బిరుదుతో సత్కారించారని గుర్తు చేశారు. గ్రామాలో తిరుగుతూ అనేక సంకీర్తనలు ఫాడి ప్రజలకు ఆధ్యాత్మికత చైతన్యం కల్పించిన గొప్ప ధార్మికుడని తెలిపారు.
మహారాష్ట్ర గ్రామలో 150 పాఠశాలను స్ధాపించి వందల వసతి గృహలను ఏర్పాటు చేసిన గోప్ప సేవవాధిగా శ్రీసంత్ గాడ్గేబాబాకు గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఏన్నో గోశాలలు, ధర్మాశాలలు, వసతి గృహలు ఏర్పాటు చేసి విద్యార్ధులకు దిశానిర్ధేశం చేసిన గూప్ప మహానీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ముప్పు భిక్షపతి ,కోట్ల శ్రీనివాస్, జయరామ్, వడ్డెబోయిన శ్రీనివాస్, కోనే్న సంపత్, యమ్ సమ్మయ్య, నర్సింగ్‌రావు, హరిశంకర్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
గొప్ప హేతువాది శ్రీ సంత్ గాడ్గేబాబా
దేశంలో ప్రత్యక్షంగా ప్రజల మధ్యన ఉంటూ తను రచించిన కీర్తన ద్వార హేతువాదాన్ని, మానవత్వాన్ని విస్తరింపజేసిన గొప్ప హేతువాది అని సిద్దిరాములు అన్నారు. శ్రీ సంత్ గాడ్గెబాబా భారత దేశానికి తొలి స్వచ్ఛ భారత్ మార్గదర్శకుడని తెలిపారు. ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ప్రజలకు స్వచ్ఛత ఆవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో శృతి యాదవ్, ముజైప్ శెబ్, ఫైజ్ శెబ్ పాల్గొన్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అవస్థలు
సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికమైన ఎండలు
ఎండల తీవ్రతను తట్టుకునేందుకు ఎన్నో పాట్లు

షాద్‌నగర్, ఫిబ్రవరి 23: వేసవి ప్రారంభం కాకముందే ఎండల తీవ్రత ఎక్కువగా పెరిగిపోతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజానీకం అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. నిన్న..మొన్నటి వరకు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు..ప్రస్తుతం పెరిగిన ఎండలను తట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా శీతలపానీయాలు, పండ్లు, రసాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గత మూడేళ్ల కిందట ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో అదే తరహాలో ప్రస్తుతం ఉండే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోయిన నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే ఇక మార్చి నెలలో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు అయిందంటే చాలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవి తాపం నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు, ఇతర వస్తువులను ప్రజలు వినియోగిస్తున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి తరువాతే ఎండలు ఎక్కువగా ఉంటాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ సవత్సరం మాత్రం ఫిబ్రవరి నాల్గొవ వారంలోనే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయిన నేపధ్యంలో తట్టుకునేందుకు ప్రజల అవస్థలు చెప్పనక్కరలేదు. ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు వచ్చి పనులు చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మున్ముందు ఎండలు తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 2016, 2017, 2018 కంటే ఈ సంవతసరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ ఏడాది ఎండలు ఎక్కువగానే ఉండే అవకాశం
గత మూడేళ్లతో పొల్చితే ఈ ఏడాది ఎండలు ఎక్కువగానే ఉండే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనాలు, ఉపరితల ద్రోణులు ఏమి ఈసారి ఉండవు. దాంతో గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావారణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు వృద్థులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యు నిపుణులు సూచనలు చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని శీతల పానీయాలకు బదులుగా కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ వంటి ఆహార పదార్థాలను తీసుకునే విధంగా ప్రజలు కృషి చేయాలని వైద్యులు పేర్కొంటున్నారు. అప్పుడే ఎండల నుంచి కొంతమేరకు ఉపశమానం లభించే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని చెప్పవచ్చు.
క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రతలు క్రమంగా వారం రోజుల నుంచి పెరుగుతునే ఉన్నాయి. ఫిబ్రవరి 16వ తేదిన గరిష్ట ఉష్ణోగ్రతలు 34.4, కనిష్టం 19.7, 17వ తేదిన గరిష్టం 33.2, కనిష్టం 21.08, 18వ తేదిన గరిష్టం 33.9, కనిష్టం 20.5, 19వ తేదిన గరిష్టం 34.2, కనిష్టం 21.9, 20వ తేదిన గరిష్టం 34.9, కనిష్టం 20.9, 21వ తేదిన గరిష్టం 32.8, కనిష్టం 21.7, 22వ తేదిన గరిష్టం 36డిగ్రీలు, కనిష్టం 21డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వాతావరణ శాఖ రికార్డులు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఇలా ఉంటే మున్ముందు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.