రంగారెడ్డి

చెత్త వేయద్దు సిసి కెమెరాలు చూస్తున్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 31: జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో పరిసరాల పరిశుభ్రతకోసం అధికారులు నిడుంబిగించారు. యువజన సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చేరుూ చేరుూ కలుపుదాం సుందర నగరంగా తీర్చిదిద్దుదామంటూ... ప్రజల్లోకి వెళుతున్నారు. స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ హైదరాబాద్ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలకు మరింత వేగం పెంచారు. కాలనీలలో రహదార్లపై చెత్తవేయకుండా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఆకర్షించే విధంగా ముగ్గులు వేస్తూ గోడలపై పెయింటింగ్ చిత్రాల ద్వారా ప్రజల్లో నూతన చైతన్యం తీసుకొస్తున్నారు. సర్కిల్ పరిధిలోని చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లలో ఇప్పటకే ఉన్న పారిశుద్ధ్య సిబ్బందితో వీధులను శుభ్రం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇళ్ల మధ్య ఉన్న చెత్తకుప్పలను ఎప్పటికప్పుడు తీయిస్తూ డ్రైనేజి, ఓపెన్ కాలువలో పేరుకుపోతున్న వ్యర్థపదార్థాలను తొలగిస్తూ, ఎక్కడబడితే అక్కడ వేయకుండా ఇంటింటికి వెళ్లి మహిళలకు వివరిస్తున్నారు. తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా విడదీసి ఇంటికి వచ్చే చెత్తబండిలో మాత్రమే వేయాలే తప్ప రహదార్లపై వేయవద్దని కోరుతున్నారు. సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు 32 ప్రాంతాలలో చెత్త వేయకుండా స్థానికులను ఆకట్టుకునేవిధంగా రంగురంగుల ముగ్గులను వేయించారు. ప్రధాన రహదార్లలో పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉన్న ప్రహరి గోడలపై మనది అందమైన నగరం అందంగా ఉంచుదామంటూ పెయింటింగ్ చిత్రాల ద్వారా మొక్కలు నాటండి, కాలుష్యాన్ని నివారించండి అంటూ ప్రచారం చేపట్టారు. రహదార్లలో మూత్ర విసర్జన చేయకుండా, చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందితో అధికారికంగా గార్డులను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రహదార్లలోని షాపుల యజమానులను వాలంటీర్లుగా నియమించి పరిశుభ్రతపై మరింత శ్రద్ధ చూపిస్తున్నారు. గ్రేటర్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి పర్యవేక్షణలో ఎల్‌బినగర్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్ నేతృత్వంలో ఉప్పల్ డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ, ఏఎంహెచ్‌ఓ మల్లిఖార్జున్‌రావు నిత్యం వీధుల్లో తిరుగుతూ ప్రజలు శుభ్రతను పాటించేవిధంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్థానిక కార్పొరేటర్లు, కాలనీ సంఘాల భాగస్వామ్యంతో వీధుల్లో శుభ్రత ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. నాగోల్ రహదారిలోని దేవేందర్‌నగర్ సమీపంలో నిత్యం సేకరించే చెత్త షిప్టింగ్ పాయింట్ వద్ద ఎరువుల తయారీకోసం వర్మీకంపోస్టును ఏర్పాటు చేయనున్నారు. ఇదే ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం అందించేవిధంగా పచ్చదనంతో పార్కులను సైతం ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్లాస్టిక్ నిషేధానికి ముందుకు వచ్చిన కాలనీలు
క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే ప్లాస్టిక్ నిషేధానికి సర్కిల్‌లోని రెండు కాలనీలు స్వచ్చందంగా ముందుకు వచ్చాయి. రామంతాపూర్ ప్రగతినగర్, హబ్సిగూడ, గ్రీన్‌హిల్స్‌కాలనీలు ఎలాంటి ప్లాస్టిక్‌ను వినియోగించబోమని స్పష్టం చేశారు. ఆయా కాలనీలలో ఉన్న షాపులు, ఇంటింటికి కరపత్రాల ద్వారా ర్యాలీలు నిర్వహించి ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా కాలనీలతో పాటు మురికివాడల ప్రజలు ముందుకు రావాలని డిప్యూటి కమిషనర్ పిలుపునిచ్చారు.
వ్యక్తిగత మరుగుదొడ్లకు దరఖాస్తులు
స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా రహదార్లలో, ఓపెన్ స్థలాల్లో బహిర్భూమికి వెళ్లకుండా ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12వేలు అందజేయడానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్ నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
మేము సైతం..
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా మేము సైతం అంటూ ముందుకు వచ్చిన ప్రేరణ సంస్థ, చిల్కానగర్ యూత్ క్లబ్ సభ్యుల బృందం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం చిల్కానగర్‌లో తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా ఇంటింటికి చెత్త రిక్షాలు, లేదా వ్యాన్లలో వేయాలని చైతన్య ర్యాలీ నిర్వహించారు. పురవీధుల్లో బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ, ఏఎంహెచ్‌ఓ మల్లిఖార్జున్‌రావు, యూత్‌క్లబ్ అధ్యక్షుడు పి.నరేష్, సభ్యులు పాల్గొన్నారు. రహదార్లలో శుభ్రతను పాటించేవిధంగా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.