రంగారెడ్డి

మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపి నర్సయ్యగౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ ఇంటింటికీ తాగునీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం ప్రజలకువరం లాంటిదని చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
వివిధ ప్రాజెక్టుల ద్వారా రంగారెడ్డి జిల్లాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును నింపే యోచనలో ఉందని చెప్పారు. పెద్ద చెరువు నిండితే ఈ ప్రాంతంలో వ్యవసాయ పరిస్థితులు మెరుగుపడుతాయని అన్నారు.
నిధుల విషయంలో ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఎంపిటిసిలు సమావేశం నుండి వాకౌట్ చేశారు. భూసార పరీక్షలు చేయించాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, చెరువులో పూడికతీత మట్టిని వ్యాపారులకు తరలించకుండా రైతులకు అవకాశం కల్పించాలని ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పూడికతీత మట్టిని రైతుల పొలాలకు తరలించాలే తప్ప వ్యాపారులకు కొమ్ముకాయడం సరికాదని అన్నారు. వ్యవసాయశాఖ ఉన్నా లేనట్టుగానే ఉందని, రైతులను చైతన్యం చేయడంలో, గ్రామాల్లో పర్యటించి రైతులకు పథకాలను వివరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో జడ్పీటిసి పొట్టి అయిలయ్య, వైస్ ఎంపిపి అశోక్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపిడిఓ అనీల్‌కుమార్, తహశీల్దార్ విజయేంధర్‌రెడ్డి, ఎడిఎ కవిత, డిఇ విజయలక్ష్మి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.