రంగారెడ్డి

రూ.200 కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మే 31: క్షేత్రస్థాయిలో గ్రామాల పురోభివృద్ధికి తమ ప్రభుత్వం నిర్మాణాత్మక అభివృద్ధిని చేపడుతుందని రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె తాండూరు, యాలాలలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.200 కోట్లతో తాండూరు నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు హరితహారం రెండవ విడతను విజయవంతం చేయాలన్నారు.
గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు శ్రద్ధ వహించాలని ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా మహిళలను చైతన్యపరచాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటి హరితహారంను విజయవంతం చేయాలన్నారు. మిషన్ కాకతీయ రెండవ దశ పనులు ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.