రంగారెడ్డి

గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మార్చి 17: గ్రామ పంచాయతీ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, పలు అభివృద్ధి పనులు ప్రారంభించనట్లు సర్పంచ్ పీ.లక్ష్మీరమేష్ వివరించారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని 3,4 వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పైపులు వేయించడంతోపాటు పనులను పర్యవేక్షించారు. సర్పంచ్ లక్ష్మీరమేష్ మాట్లాడుతూ అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి వార్డులో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరి సహకారంతోనే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. గతంలో పనిచేసిన నాయకులు పంచాయతీ అభివృద్ధిలో కొంతమేరకు నిర్లక్ష్యం వహించడం వల్లే అభివృద్ధిలో వెనకబడిపోయిందని, ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం పనులు అన్ని వార్డుల్లో వేయిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామకంఠం భూమిలోని హద్దురాళ్ల తొలగింపు
కీసర, మార్చి 17: కీసర గ్రామంలోని గ్రామకంఠం భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఔట్‌లోని హద్దురాళ్లను పంచాయతీ కార్యదర్శి నాగేశ్.. సిబ్బంది సహాయంతో తొలగించారు. గ్రామ కంఠం భూమిలో అక్రమంగా లే ఔట్‌లు చేయటం చట్టవిరుద్ధమని నాగేశ్ పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు, లేఔట్‌లు చేసేవారు ఎంతటి వారైనా క్షమించేది లేదని స్పష్టం చేసారు. అక్రమ నిర్మాణాలు, లే ఔట్‌లు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

శ్యాంబాబా నిషాన్ యాత్ర
రాజేంద్రనగర్, మార్చి 17: అత్తాపూర్ డివిజన్‌లో శాయంబాబా నిషాన్ యాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి పాల్గొన్నారు. వనం శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ అత్తాపూర్ డివిజన్‌లో ప్రతి ఏడాది శాయంబాబా నిషాన్‌యాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు. యాత్రకు డివిజన్ వాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జైహింద్ రెడ్డి, బాబురావు, శివ, జోషి, పవన్ పాల్గొన్నారు.