రంగారెడ్డి

మార్చిలోనే భానుడి భగభగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 17: మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకీ భానుడి ప్రతాపం పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండుతున్న ఎండల వేడిమికి ఇళ్లల్లో నుండి ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండలు విపరీతంగా వేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎండల తాకిడికి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మండుతున్న ఎండలతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఎండల వేడిమి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావడం లేదు. ఇళ్లల్లో ఉక్కపోతలతో గృహవాసులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఓవైపు మంటలు కురిపిస్తున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటికి వెళ్తే మండుతున్న ఎండలు, ఇళ్లల్లో ఉంటే ఉక్కపోతలతో ప్రజలు అవస్థలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుంటే ఏప్రిల్, మే మాసాలలో ఏ విధంగా ఉంటాయో అనే భయం ప్రజలను వెంటాడుతుంది. మండతున్న ఎండలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 12 గంటల నుంచి భానుడి ప్రతాపానికి ప్రయాణికులు, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.
నియోజకవర్గంలోని ఐడీపీఎల్ కాలనీ నుంచి షాపూర్‌నగర్, జీడిమెట్ల, గాజులరామారం, గండిమైసమ్మ, దుందిగల్ వరకు బహద్దూర్‌పల్లి నుంచి కొంపల్లి వరకు, కొంపల్లి నుంచి సుచిత్రా చౌరస్తా వరకు, నిజాంపేట్ నుంచి మల్లంపేట్, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పలు ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండిపోతున్న ఎండల వేడిమికి రోడ్లపై నుంచి వెళ్తుంటే వేడి తాకిడి ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
శీతల పానియాలను ఆశ్రయిస్తున్న జనాలు
రోజురోజుకీ పెరిగిపోతున్న ఎండల వేడిని తట్టుకోలేక ప్రజలు శీతలపానీయాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అత్యధికంగా పళ్ల రసాలు, చెరుకు రసం, నిమ్మరసం, కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలతో పాటు వాటర్ మిలన్‌లకు ఎక్కువగా గిరాకీ మొదలైంది. ధరలను వ్యాపారస్థులు పెంచుతున్నారు. ప్రధాన రహదారులలోని ప్రధాన సెంటర్‌లలో ఎక్కువగా వాటర్ మిలన్, నిమ్మరసం, చెరుకు రసం, కొబ్బరిబొండాల విక్రయం ఎక్కువగా జరుగుతుంది. తలకు గుడ్డను ధరించి, వీస్తున్న ఎండలకు ఎంత తక్కువగా బయట తిరిగితే అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తాకిడి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పరేషాన్
యాచారం: రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చి రెండవ, మూడవ వారానికే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది భానుడు తీవ్రస్థాయిలో ప్రతాపాన్ని చూపే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొంటుంది. రెండేళ్లుగా 4-6 డిగ్రీల మేరా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రంతో పోలిస్తే పగటి వేలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని, ఇవి ఇంకా పెరిగి ఏప్రిల్, మే నాటికి రికార్డు స్థాయికి చేరుకుంటాయని హెచ్చరిస్తున్నారు. మార్చి నెలలో సాధారణం కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు వెల్లడించారు. వడగాడ్పులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెలాఖరు కల్లా 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని, ఏప్రిల్, మే నెలల్లో 45 డిగ్రీలకు చేరుకోవచ్చని పేర్కొంటున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎండవేడిమి అధికంగా ఉంటోంది. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. వెళ్లాల్సి వస్తే వెంట తాగునీరు, గొడుగు తీసుకెళ్లాలని, తెల్లని కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని పేర్కొంటున్నారు. కొబ్బరిబొండాలు, మజ్జిగ, పళ్ల రసాలు లాంటి ద్రవ పదార్థాలు అధిక మోతాలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.