రంగారెడ్డి

శిధిల భవనాల్లో విద్యార్థుల చదువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, మార్చి 17: మండల పరిధిలోని చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు కనబడటంతో పాటు ప్రతి నిత్యం ఊడి పడుతున్న సిమెంట్ పెచ్చులతో విద్యార్థులు భయంభయంగా చదువులు సాగిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో పడిపోతాయని తెలిసినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పాఠ్యాంశాలు వింటున్నారు. చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనే చందగా పంతుళ్లు చెప్పే పాఠాలు తలకెక్కడం మాట అటుంచి పాఠశాల ఎప్పుడు వదులుతారు.. తాము ఇంటికి ఈ రోజు వెళతామా అనే రీతిలో విద్యార్థులు ఆలోచనలు సాగుతున్నాయి. వర్షాకాలం వస్తే భవనం మొత్తం కురుస్తుందని, కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి భవనాన్ని కూల్చివేయకపోతే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో ఐదు తరగతులకు 309 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరవ తరగతి విద్యార్థులకు కూర్చోవడానికి గదులు లేకపోవడంతో వరండాల్లో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఎనె్నమీది తండా ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు 58 మందికి పైగా విద్యార్థులు వున్నారు. పాఠశాల పాత భవనం పైకప్పు శిథిలావస్థకు చేరింది. పైకప్పు కింది భాగంలో సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇదే పాఠశాలలో గతంలో నిర్మించిన అదనవు తరగతి భవనానికి ప్లాస్టరింగ్ చేయకుండా, తలుపులు బిగించకుండా, బండలు వేయకుండా అసంపూర్తి వదిలేశారు. నాజ్‌ఖాన్‌పల్లి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయింది. కాకర్లగండి తండా, అంసాన్‌పల్లి, బాపల్లితండా, భోజన్నగడ్డ తండా, బురాన్‌పూర్ తండా, బురాన్‌పూర్, లింగన్‌పల్లి, లోతుకుంటతండా, రోటిబండ తండా, సోమ్లానాయక్ తండా, తుంకిమెట్ల, సాలిండాపూర్, నాందార్‌పూర్, ఏర్పుమళ్ల, అల్లిఖాన్‌పల్లి, లగచెర్ల, చిల్‌ముల్ మైలారం, గౌరారం పాఠశాలల్లో తరగదుల పైకప్పులు శిథిలావస్థకు చేరాయి. రానున్న విద్యా సంవత్సరం నాటికైనా అవసరమైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. మండల విద్యాధికారి రాంరెడ్డిని వివరణ కోరగా, మండలంలోని 70 పాఠశాలల్లో 38 పాఠశాలల్లో మేజర్ రిపేర్లు, 47 పాఠశాలల్లో మైనర్ రిపేర్లు, 20 తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేపడతామని అన్నారు.