రంగారెడ్డి

ఆరోగ్యలక్ష్మీకి తగ్గుతున్న ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మార్చి 23: బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఆరోగ్యలక్ష్మీ’ పథకం ప్రారంభిస్తే స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మీ పథకంలో భాగంగా ప్రతి గర్భిణి.. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, స్థానిక అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది సరైన అవగాహన కల్పించడంతో గర్భిణులు, బాలింతలు ఎవరు అంగన్‌వాడీ కేంద్రాలకు రావడం లేదు. మరికొన్ని అంగన్‌వాడి కేంద్రాల్లో సిబ్బంది నేరుగా గర్భిణుల ఇంటికి సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పెట్టె ఒక్కపూట భోజనాన్ని తీసుకునేందుకు బాలింతలు, గర్భిణులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పౌష్ఠికాహారం లేకపోవడం వంటి పరిస్థితుల నేపధ్యంలోనే మహిళలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తొంది. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును పర్యవేక్షించి ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరించడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెప్పవచ్చు. కొత్తూరు మండలంలో మొత్తం 31 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా అందులో 27 పెద్ద అంగన్‌వాడీ కేంద్రాలు, నాలుగు చిన్న కేంద్రాలు ఉన్నట్లు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. కేంద్రాల్లో మొత్తం సుమారు 400మందికి పైగానే గర్భిణులు, బాలింతలు ఉన్నట్లు తెలుస్తొంది.
పౌష్ఠికాహారం పంపిణీ ఇలా
ఆరోగ్యలక్ష్మీ పథకంలో పౌష్ఠికాహారం పంపిణీ ఈవిధంగా చేయాల్సి ఉంటుంది. గర్భిణులు, బాలింతలు.. ఆరోగ్యలక్ష్మీ పథకంలో నిర్ణీత గడువు వరకు ప్రతిరోజు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందించే విధంగా పథకాన్ని రూపొందించారు. అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో నమోదైన గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు ఒక్కొక్కరికీ 200 మిల్లీ లీటర లపాలు, ఉడికించిన కోడిగుడ్డుతోపాటు 150గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనెతో పౌష్ఠికాహారం భోజన రూపంలో అందించాల్సి ఉంటుంది. కానీ, అంగన్‌వాడీ కేంద్రాలు సకాలంలో తెరవకపోవడం, పౌష్ఠికాహారాన్ని గర్భిణులకు, బాలింతలకు ఇవ్వకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు, చిన్నారులకు పౌష్ఠిక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పౌష్ఠికాహారం ఇస్తున్నాం
ఆరోగ్యలక్ష్మీ పథకంలో గర్భిణులకు, బాలింతలకు పౌష్ఠికాహారం సక్రమంగా అందిస్తున్నామని షాద్‌నగర్ సీడీపీఓ నాగమణి వివరించారు. అంగన్‌వాడీ కేంద్రం నుంచి గర్భిణులకు, బాలింతల ఇంటి వద్దకు సరకులు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి ఇప్పటివరకు రాలేదని, ఒకవేళ అలా ఇస్తే వారిపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పౌష్ఠికాహారం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.